Category Archives: videos

‘ఆచార్య’ సెట్స్‌కి సైకిల్‌పై వెళ్లిన సోనూసూద్.. వీడియో వైరల్

సోనూ సూద్.. ఇది పరిచయం అక్కర్లేని పేరు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఆపద్భాందవుడిగా నిలిచిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆదుకుని సోనూసూద్ చేసిన సాయంపై యావత్ భారతావని ప్రశంసలు కురిపించింది.

ప్రస్తుతం సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్‌పై వెళ్లారు. సోనూసూద్‌కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఉద‌యాన్నే సెట్‌కి వెళ్లాల్సి రావడంతో ఆయన సైక్లింగ్ చేసుకుంటూ సెట్‌కి వెళ్లిపోయారు. భాగ్యనగర రోడ్డలపై ఆయన సైకిల్‌ తొక్కుతూ వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.



రవితేజ ‘ఖిలాడి’ టీజర్.. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహరాజ్

‘క్రాక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహరాజ్ రవితేజ ఈసారి ‘ఖిలాడి’గా రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి సోమవారం టీజర్ విడుదల చేసింది యూనిట్.

ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ‘ఖిలాడి’ టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహారాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది. థ్రిల్లింగ్, యాక్షన్ కలయికలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘ఖిలాడి’ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తూనే తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.





‘వకీల్ సాబ్’ ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ట్రైలర్‌లో తన విశ్వరూపం చూపించారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో అభిమానుల మధ్య నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఇదొక కోర్టు డ్రామా కథాంశంతో రూపొందిన చిత్రం. దీనికి తగ్గట్లుగానే ట్రైలర్‌లో కోర్టు రూమ్‌ డ్రామానే ఎక్కువ చూపించారు. నివేదా కేసు వాదించే న్యాయవాదిగా పవన్‌ కనిపించారు. ప్రకాష్‌రాజ్‌ వీరిని వ్యతిరేకించే న్యాయవాదిగా నందా పాత్రలో కనిపించారు. ప్రచార చిత్రంలో ‘పింక్‌’ ఛాయలు కనిపించినా.. పవన్‌ ఇమేజ్‌కి తగ్గట్లుగా కథకు కావాల్సినంత కమర్షియల్‌ టచ్‌ ఇచ్చినట్లు అర్థమైంది. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ – ప్రకాష్‌రాజ్‌ల మధ్య నడిచిన కోర్టు వాదనలు.. పవన్‌ యాక్షన్‌ హంగామా.. ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.