ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’
Category : Latest Events Latest Reviews Movie News Sliders
ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’
`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `నిశ్శబ్దం`.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఈ క్రాస్ జోనర్ చిత్రంలో సాక్షి అనే డిఫరెంట్ పాత్రలో అనుష్క మెప్పించనున్నారు. అలాగే మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల , మైకేల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాత్రల లుక్స్‌తో పాటు ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను పెంచింది.
నటీనటులు:
నుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో మెయిన్ రోల్స్ తదితరులు
సాంకేతిక వర్గం:
సంగీతం: గోపీ సుందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీరజ కోన, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంకట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్, స్టోరీ, డైరెక్షన్ – హేమంత్ మధుకర్.–