నవీన్ చంద్ర హీరోగా నేను లేని నా ప్రేమకథ
Category : Latest Events Latest Reviews Movie News Sliders
నవీన్ చంద్ర హీరోగా నేను లేని నా ప్రేమకథ
విభిన్నమైన పాత్రలు ఎంచుకుని మరీ సెలక్ట్ గా సినిమాలు చేస్తూ తనకంటూ నటుడిగా ప్రత్యేఖ స్థానం సంపాయించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఒ కొత్తరకం ప్రేమ కథా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి సమర్పణలో త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కళ్యాణ్ కందుకూరి నిర్మాతగా సురేష్ దర్శకత్వం లో రూపోందిన చిత్రానికి టైటిల్ గా నేను లేని నా ప్రేమకథ టైటిల్ ని ఖరారుచేశారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర సరసన గాయత్రి ఆర్ సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. క్రిష్ సిద్దిపల్లి, అదితి లు మరో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంల ప్రముఖ నటుడు రాజారవీంద్ర కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం యెక్క మెదటి లుక్ టైటిల్ ని లాంచ్ చేశారు.
ఈ సందర్బంగా నిర్మాత కళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ.. చాలా రొజుల తరువాత ఓ ఫ్రెష్ లవ్ స్టోరి తో దర్శకుడు సురేష్ మా దగ్గరకి రావటం జరిగింది. విన్నవెంటనే చాలా కొత్తగా అనిపించింది. కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యాను. నేనే కాదు ఈ సినిమా చూసిన ప్రతిఓక్కరూ వారి వారి ప్రేమ కథకి కి దగ్గరవుతారు. నవీన్ చంద్ర, హీరోయిన్ గాయత్రి ఆర్ సురేష్ వారి పాత్రల్లో ఇమిడిపోయి నటించారు. ఈ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రత్యేఖంగా రాజారవీంద్ర పాత్ర అందర్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం యెక్క మెదటి టైటిల్ లుక్ టీజర్ ని పోస్టర్ ని విడుదల చేశాము. టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ రావటం చాలా ఆనందంగా వుంది. త్వరలో ఈ మెదటి లుక్, మెదటి లుక్ టీజర్ ని విడుదల చేస్తాము.. అని అన్నారు..
దర్శకుడు సురేష్ మాట్లాడుతూ.. ప్రేమ అంటే అది ప్రతి ఓక్కరి మనసులోని చక్కటి ఫీలింగ్.. ఆ ఫీలింగ్ కి ఎదుట మనిషికి తెలియజేయటం అంటే అంత ఈజీ కాదు అది ప్రేమ విషయం లో దేశ ప్రధాని కూడా చిన్న పిల్లవాడవుతాడు. అలాంటి చక్కటి ఫీలింగ్ ని అంతే చక్కగా తెరకెక్కించిన చిత్రం నేను లేని నా ప్రేమకథ.. ఇలాంటి ప్రేమకథ ని నేను దర్శకత్వం వహించటం.. ఆ ఛాన్స్ నిర్మాత కళ్యాణ్ గారు నాకు ఇవ్వటం చాలా ఆనందంగా వుంది. ఈరోజు విడుదల చేసిన ఈ టైటిల్ టీజర్ చాలా వినూత్నం గా వుందని అందరూ ప్రశంశించటం చాలా ఆనందంగా వుంది. అంతపురం, ఖడ్గం లాంటి అద్బుతమైన చిత్రాలకి పనిచేసిన ఎస్.కె.ఏ.భూపతి చాలా అద్బుతమైన విజువల్స్ అందించారు. అలాగే ఎన్నో చిత్రాలకి తన పనితనంతో విజయాల్ని సునాయసం చేసిన ఎడిటర్ ప్రవీణ్ పూడి పనితనం ఆకట్టుకుంటుంది. అని అన్నారు.
నటీనటులు.. నవీన్ చంద్ర, గాయత్రి ఆర్ సురేష్, క్రిష్ సిద్దిపల్లి, అదితి, రాజారవీంద్ర , బందు దివిజ తదితరులు నటించగా..
ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి సమర్పణ
బ్యానర్.. త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్
కొ-ప్రోడ్యూసర్స్.. గూడురు వెంకట్, గూడురు ప్రసాద్
కెమెరా.. ఎస్.కె.ఏ.భూపతి
ఎడిటర్.. ప్రవీణ్ పూడి
మాటలు.. సభీర్ షా
సంగీతం.. జువెన్ సింగ్
లిరిక్స్.. రాంబాబు గొసాల
పి ఆర్ ఒ .. ఏలూరు శ్రీను, మెఘ శ్యామ్