పూరి జగన్నాధ్ చేతుల మీదుగా అశ్వద్ధామ ట్రైలర్

పూరి జగన్నాధ్ చేతుల మీదుగా అశ్వద్ధామ ట్రైలర్

యూవ హీరో నాగ శౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన అశ్వద్ధామ మూవీ టీజర్ ను ఇటీవల సమంత విడుదల చేసిన సంగతి తెలిసిందే, టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేయబోతున్నాడు.

అశ్వద్ధామ ట్రైలర్ జనవరి 23న సాయంత్రం 5.04 గంటలకు పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదల కాబోతొంది. అందరి అంచనాలకు తగ్గటు ట్రైలర్ ఉండబోతొంది.

నాగ శౌర్య సరసన మెహిరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనకు ఆధారంగా తెరకెక్కింది. అశ్వద్ధామ జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

నటీనటులు: నాగ శౌర్య, మెహరిన్

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా మూల్పూరి
కథ: నాగ శౌర్య
డైరెక్టర్: రమణ తేజ
కెమెరా: మనోజ్ రెడ్డి
మ్యూజిక్: శ్రీచరన్ పాకాల
ఎడిటర్: గ్యారీ
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
డిజిటల్: గౌతమ్
డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్
యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్