`ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా….` అనే హార్ట్ ట‌చింగ్ మెలోడీ సాంగ్‌తో ఆక‌ట్టుకుంటున్న `జాను`

`ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా….` అనే హార్ట్ ట‌చింగ్ మెలోడీ సాంగ్‌తో ఆక‌ట్టుకుంటున్న `జాను`

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం `జాను`. ఈ సినిమాలో తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

“ప్రాణం నా ప్రాణం..నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ‌
తారా తీరం మ‌న దారిలోకాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉద‌యాల‌నే విసిరేలా…“ అంటూ హార్ట్ ట‌చింగ్ మెలోడీ ప్రేమ‌లోని గాఢ‌త ఈ పాట‌లో తెలియ‌చేస్తుంది.
గోవింద్ వ‌సంత సంగీత సార‌థ్యంలో శ్రీమ‌ణి రాసిన ఈ పాట‌ను చిన్న‌యి, గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్ ఆల‌పించారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

న‌టీన‌టులు:
శ‌ర్వానంద్‌, సమంత‌

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
సంగీతం: గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి