సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్

సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్

సినీ రాజకీయల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ కార్యక్రమం ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు నటి దివ్యవాణి, హేమ, నక్కిన త్రినాధ్ రావు, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ…
ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ చూసిన తరువాత మంచి మెసేజ్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. వర్మ, పూరి స్టైల్ లో ఈ సినిమా ఉండబోతోందని అనుకుంటున్నాను. మాస్ మసాలా కోరుకునే ఆడియన్స్ కు ఈ సినిమా

నవీన్ యాదవ్ మాట్లాడుతూ…
డైరెక్టర్ ఈ సినిమాను కష్టపడి చేశాడు, హీరోగా మధు సుదన్ కు ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న, తాను నాకు ఎప్పటినుండో తెలుసు, మంచి బ్రేక్ కోసం చూస్తున్న మధు సుధన్ మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. అందరిలాగే నేను ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు మీనా బజార్ సినిమాను తప్పకుండా సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను అన్నారు.

నటి దివ్యవాణి మాట్లాడుతూ…
నా పేరు మీనాక్షి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మధు సుధన్ ఈ సినిమాతో హీరోగా మరో మెట్టు ఎక్కుతాడని భావుస్తున్నాను. మీనా బజార్ టైటిల్ ఆలోచింపజేస్తుంది, ఈ సినిమాలో నటించిన అందరూ నటీనటులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. సొసైటీకి దగ్గరగా ఉన్న ఈ కాన్సెప్ట్ అందరిని అలరించాలని కోరుకుంటున్న అన్నారు.

డైరెక్టర్ నక్కిన త్రినాద్ రావు మాట్లాడుతూ…
నాకు హీరో మధు గారితో మంచి అనుబంధం ఉంది, మీనా బజార్ సినిమాతో తను హీరోగా లాంచ్ అవ్వడం సంతోషంగా ఉంది. టీవీ స్థాయి నుండి సినిమా స్థాయికి ఎదిగినందుకు తనకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. సినిమా తీయడం అనేది కష్టమైన పని, ఇలాంటి సందర్భంలో మనం చిన్న సినిమాలను సపోర్ట్ చెయ్యాలి. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

హీరో మధుసూదన్ మాట్లాడుతూ….
మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. మీనా బజార్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, కష్టపడి పనిచేసిన ఈ సినిమాకు మంచి రిజస్ట్ వస్తుందని భవిస్తూన్నాను. క్లైమాక్స్ చూసే వరకు సినిమాను గెస్ చెయ్యలేరు. నన్ను సీరియల్స్ లో ఆదరించారు, అదే సపోర్ట్ నాకు సినిమాల్లో ఎదగడానికి కావాలని కోరుకుంటున్న అన్నారు.

డైరెక్టర్ & నిర్మాత రానా సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ…
మీనా బజార్ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే ఆడియన్స్ కు కొన్ని డౌట్స్ రావాలని అనుకున్నాను, వచ్చాయి. వాటికి సమాధానం సినిమా చూస్తే తెలుస్తుంది. బజార్ లో అమ్మేవారు, కొనేవారు మాత్రమే ఉంటారు, అలా ఒక ఐదు ప్రధాన పాత్రలను బేస్ చేసుకొని ఈ కథ రాయడం జరిగింది. ప్రతి మనిషిలో ఈగో ఉంటుంది, అలా ఈగో ఉన్న ఐదు పాత్రలు కలిస్తే ఏమవుతుందో అనేదే ఈ సినిమా. ఈ మూవీ క్లైమాక్స్ వరకు ఒక జర్నీ ఉంటుంది, నెక్స్ట్ ఎం జరుగుతుంది అనేది గెస్ చేయలేము, ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని భవిస్తున్నాను అన్నారు.

*నటీనటులు:*
వైభవీ జోషి
శ్రీజిత ఘోష్
మధుసూధన్
రాజేష్ నటరంగ
రానా సునీల్ కుమార్ సింగ్
మధు సుధన్
శ్రీజిత ఘోష్
అరవింద్ రావ్
జీవ
మనిత
వేణుగోపాల్

*సాంకేతిక నిపుణులు:*

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: రానా
సునీల్ కుమార్ సింగ్

నిర్మాత: నాగేంద్ర సింగ్
కెమెరామెన్: మ్యాథీవ్
సంగీతం: కద్రీ మనికాంత్
ఎడిటర్: శ్రీకాంత్
కొరియోగ్రాఫర్: సుజి, అని, కల్పన్
ఫైట్స్: రియల్ సతీష్
పి.ఆర్.ఓ: మధు విఆర్