మెరిసే చర్మం కోసం..
Category : Health new Sliders
మెరిసే చర్మం కోసం చాలా మంది ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అంటూ అన్నీ వాడేస్తుంటారు. అలా వాడటం వలన అవి చర్మానికి అప్పటికప్పుడు తాజాదనాన్ని ఇచ్చినా, తరువాత ఎన్నో దుష్ఫలితాలాను కలుగచేస్తాయి. ఆ క్రీమ్స్ లో వుండే రసాయనాలు మన చర్మానికి చేడు ప్రభావాన్నికలిగిస్తాయి. అంతేకాదు వాటివలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మనం ఇంట్లోనే తయారుచేసుకునే ఫేస్ పాక్స్ వలన మన చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాదు చర్మం కూడా మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.
అలానే మన వంట ఇంట్లో వాడే బియ్యం పిండితో మన చర్మానికి చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం బయటికి వెళ్లేటప్పుడు బియ్యం పిండిని కామ్ స్మాష్ తో కలిపి రాసుకోవడం వలన చర్మం మీద ఉండే ఆయిల్ పోతుంది. బియ్యంపిండిని అలోవెరా తేనెతో కలిపి రాసుకోవడం వలన మన ముఖంపై వుండే ముడతలు మరియు నల్లని మచ్చలు కనుమరుగవుతాయి. బియ్యం పిండి, శనగ పిండి కొబ్బరి నూనె కలిపి స్క్రబ్ లా వాడటం వలన మన చర్మానికి మెరుగైన కాంతి వస్తుంది. బియ్యం పిండితో గుడ్డులోని తెల్ల సొన కలిపి రాసుకోవడం వలన చర్మానికి బిగుతు వస్తుంది. బియ్యం పిండి, పాలపొడి, ఒత్నిల్ కలిపి రాసుకొవడం వలన చర్మం మృదువుగా అవుతుంది.