‘గేమర్‌’ ట్రైలర్ ఆవిష్కరణ

‘గేమర్‌’ ట్రైలర్ ఆవిష్కరణ


బి.జి.వేంచర్స్‌ పతాకంపై నూతన నటీనటులతో రాజేష్‌ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమర్‌’. శ్రనిత్‌ రాజ్‌, కల్యాణి పటేల్, అనిరుధ్‌, నేహా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ట్రైలర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ చూశాను. అద్భుతంగా ఉంది. తడకల రాజేష్ నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ ఈ సినిమా తీశారు. మంచి డాన్సెస్, ఎంటర్టైన్మెంట్, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ అన్నింటితో ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా చేశాడు రాజేష్.

ఇలాంటి చిన్న సినిమాల దర్శకనిర్మాతలను ప్రోత్సహించే భాద్యత ప్రభుత్వం పైనా, సమాజం పైనా ఉంది. ఎందుకంటే వీళ్ళందరికి థియేటర్లు దొరకడం కష్టంగా ఉంది. కొత్త టాలెంట్ రావాలంటే చిన్న దర్శకనిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. తద్వారా గ్రామాల్లో ఉన్న టాలెంట్ కు అవకాశాలు దక్కుతాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అనిపిస్తోంది. హీరోహీరోయిన్స్ శ్రనిత్‌ రాజ్‌, కల్యాణికి దర్శకనిర్మాత రాజేష్ కు ఆల్ ది బెస్ట్’ అన్నారు.

హీరో శ్రనీత్ మాట్లాడుతూ ‘ట్రైలర్ విడుదల చేసిన వివేక్ గారికి థాంక్స్. నా తల్లిదండ్రుల వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. నాకు మెయిన్ కారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్స్. ఎంతో క్లారిటీ ఉన్న దర్శకుడు ఆయన.

సినిమా టీమ్ అంతా ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేశారు. అందరికి థాంక్స్. హీరోయిన్ కల్యాణి మాట్లాడుతూ ‘అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత రాజేష్ గారికి థాంక్స్. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అని, కచ్చితంగా చూడాలని ఆశిస్తున్నాను’ అని చెప్పింది.<>/p

దర్శకనిర్మాత రాజేష్ మాట్లాడుతూ ‘ఎంతో బిజీగా ఉండికూడా చిన్న సినిమాను ఎంకరేజ్ చేయడం కోసం
మా సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించిన వివేక్ అన్నకు ధన్యవాదాలు. ఇప్పటికే ఆరు చిత్రాలు చేసిన నాకిది ఏడవ సినిమా.బి.

జి.యాక్టింగ్‌ అకాడమీ ద్వారా నటీనటులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవకాశం ఇస్తున్నాను. ఈ సినిమాతో పరిచయం అవుతోన్న శ్రనీత్ రాజ్ పెర్ఫామెన్స్ బాగుంది. చాలా కష్టపడ్డాడు. కల్యాణి పటేల్ కూడా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అనిరుద్, నరేందర్, అల్తాఫ్, సింధు నిహ ఇతర పాత్రలు పోషించారు. ప్రతీ సీన్ డిఫరెంట్ గా ఉంటూ ఆసక్తి రేపుతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయిన ఈ సినిమాను ఫిబ్రవరి 1న విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులు విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనిరుద్, నరేందర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.