కేన్సర్ బాధిత అభిమానికి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ పరామర్శ.
Category : Movie News Sliders
మా తెలుగు ప్రజలు అభిమానిస్తే ప్రాణం పోయోవరకూ అభిమానిస్తూంటారు అని ఓ సినిమాలో ప్రకాష్‌రాజ్ అన్న డైలాగ్ గుర్తోస్తుంది నిన్నటి సంఘటన చూస్తే.. ఓ పక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న ఓ చిట్టితల్లి తను అభిమానించే నటుడు తనకి దగ్గరగా వచ్చాడని తెలిసి తన అనారోగ్యం తనని ఓంటిదానిగా మార్చినా తన అభిమానం తనని ముందుకు నడిపించిన తీరు ఆ బంగారు తల్లి అభిమానానికి అక్కడున్నవారికి మాటలు రాలేదు.. మనసులు చమ్మగిల్లాయి.. ఆ అభిమాన హీరో దిగ్బ్రాంతి చెందాడు.. కాని ఆ చిట్టి తల్లికి వున్న పాజిటివ్ నెస్ ని చూసి ఆనంద పడ్డాడు. దగ్గరగా వెళ్ళి పరామర్శించాడు.. తనకి సహయాన్ని అందించిన ప్రతి ఓక్కరికి తన ధన్యవాదాలు తెలిపాడు.. తన ఆరోగ్య విశేషాలని తెలుసుకున్నాడు.. మనసులో దేవున్న ప్రార్ధించాడు..
తేజ్ ఐ లవ్ యు చిత్రానికి సంభందించిన ప్రమెషన్ లో భాగంగా విశాఖపట్నం నుండి హైదరాబాద్ కి తిరుగుప్రయాణం లో విమానాశ్రమం వద్దకు చేరుకున్నారు సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్.. ఇంతలోనే ఓ పిలుపు అతన్ని పలకరించింది. పాండ్రంగి గ్రామానికి చెందిన బంగారమ్మ అనే యువతి బోన్ కేన్సర్ తో భాదపడుతుంది. డాక్టర్ ట్రీట్మెంట్ లో భాగంగా ఓ లెగ్ ని తీసివేశారు. ఇటీవల 10 వ తరగతి లో 8.5 గ్రేడ్ ని సాధించింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న పెందుర్తి గ్రామానికి చెందిన రాము అనే యువకుడు ఆమెకి ఆసరాగా నిలబడ్డాడు. అయితే తన అభిమాన హీరో సాయిధరమ్ తేజ్ సిటి కి రావటంతో తెలుసుకున్న బంగారమ్మ తన అభిమాన హీరోని కలవానుకుంది.. ఈ విషయం తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ తన అభిమానులచే తనని విమానాశ్రమం దగ్గరకి పిలిపించి కలిసారు.. అంతేకాకుండా తన ఆరోగ్యం ఎలా వుందని అడిగి తెసుసుకున్నాడు. తనకి ఇంతలా సహయ పడుతున్న రాము ని కూడా అభినందించాడు.. బంగారమ్మ ఆరోగ్యం బాగా కుదుటపడాలని మెగా అభిమానులందరూ ప్రార్ధన చేయాలని అంతే కాదు ఈ విషయం తెలుసుకున్నవారంతా తన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని మనస్పూర్తిగా సాయిధరమ్ తేజ్ కోరారు..