ఇండియన్ సినిమా చరిత్రలొనె తొలి స్పెస్ మూవీగా హాలీవుడ్ చిత్రాల క్వాలీటి కి ఏమాత్రం తగ్గకుండా టిక్ టిక్ టిక్ ను రూపొందించాం. మా ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చెశారు. ఇలాగే మరిన్ని వైవిధ్యమైన, కథాబలమున్న సినిమాలను మీ ముందుకు తీసుకువస్తామన్నారు.
నిర్మాత లక్ష్మణ్ చదలవాడ మాట్లాడుతూ.. బిచ్చగాడు, డి 16, ఇప్పుడు టిక్ టిక్ టిక్. హ్యాట్రిక్ విజయాలు మా బ్యానర్ కు తెలుగు
ప్రేక్షకులు అందించారు. మా చిత్రాలకు ఆడియెన్స్ మౌత్ పబ్లిసిటీ నే బలం. అందుకే నేరుగా ప్రేక్షకుల కు దన్యవాదాలు తెలిపెందుకు మీ ముందుకు వచ్చామన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. మంచి సినిమాలకు ఎల్లప్పుడు ఆదరణ ఉంటుందని మరొసారి ఆడియెన్స్ నిరూపించినందుకు ఆనందంగా ఉందన్నారు.