మెట్టమెదటిసారిగా మెషన్ క్యాప్చర్ టెక్నాలజిని సమర్దవంతంగా వాడి, దాదాపు 1000 షాట్స్ వి ఎఫ్ ఎక్స్ చేసిన చిత్రం సంజీవని.. ఇలాంటి చిత్రాలు కేవలం హలీవుడ్ లో మాత్రమే వస్తాయి. కాని మెట్టమెదటిసారి ఎన్నో కష్టాలు భరించి దర్శకుడు రవి వీడే, నిర్మాత జి.నివాస్ లు దాదాపు రెండు సంవత్సరాలు ఇష్టంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ప్రధాన పాత్రల్లో అనేకమంది హలీవుడ్ టెక్నిషియన్స్ తో పది అడుగుల సాలెపురుగులు, భారీ కొతులు, గాల్లో ఎగిరే బల్లులు ఇలా రకరకాల జంతువుల్ని క్రియెట్ చేసి ప్రేక్షకుల్ని అబ్బురపరిచేందుకు జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.
ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా లక్ష్మి పిక్చర్స్ ద్వారా బాపిరాజు గారు విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ.. మనం చిన్నతనం నుండి రకరకాల జంతువుల్ని గ్రాఫిక్స్ లో చూశాం. కాని ఇప్పడు మా సంజీవని చిత్రం లో మాత్రం చాలా కొత్తగా అంటే యాక్షన్ అబ్బురపరిచేలా వుంటాయి.. గ్రాఫిక్స్ కూడా ఏదో చేశామంటే చేశామని కాకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూట్ చేశాము. మా చిత్రంలో అబ్బురపరిచే యుద్ధాలు వుంటాయి. 6 సంవత్సరాల పిల్లల నుండి60 సంవత్సరాల పెద్దవాళ్ళ వరకూ ఆనందంతో ఉప్పొంగిపోయే సన్నివేశాలుంటాయి. అలాంటివి ఇప్పటి వరకూ హాలీవుడ్ తెరపై మాత్రమే కనిపించాయి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి రెండు సంవత్సరాలు,తెలుగులో మెషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడి, దాదాపు1000 కి పైగా VFX షాట్స్ తో, ఇండియాలోనేకాకుండా కెనడా, ఆఫ్రికా, నేపాల్ దేశాల్లో అత్యద్భుతమైన లొకేషన్స్ లో అత్యంత కష్టతరమైనా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ పిక్చర్ అనేరేంజి లో భారీ గ్రాఫిక్స్ తో నిర్మించిన చిత్రం మా సంజీవని. ఈ చిత్రం యెక్క టీజర్ ని, ట్రైలర్ ని, ఆడియోని విడుదల చేశాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. మా సినిమా కి వచ్చిన ప్రేక్షకుడు మరో లోకంలో విహరిస్తాడనేది మేము గ్యారంటిగా చెప్పగలను. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 29 న విడుదలవుతుంది. మొట్టమొదటి భారీ గ్రాఫిక్స్ చిత్రం గా చిన్న పిల్లల్ని,ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే చిత్రం గా మా సంజీవని మొదటి స్థానంలో వుండబోతుంది. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత లు ప్రధాన పాత్రల్లో నటించగా శ్రవణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మా చిత్రాన్ని ప్రముఖ సంస్థ శ్రీ లక్ష్మి పిక్చర్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తప్పకుండా పిల్లలు , పెద్దవారితో కలిసి ఫ్యామిలి అంతా చూడవలసిన చిత్రం … అని అన్నారు
లక్ష్మిపిక్చర్స్ అధినేత బాపిరాజు గారు మాట్లాడుతూ.. ఫ్యామిలి ఆడియన్స్ అమితంగా ఇష్టపడే చిత్రం గా సంజీవిని వుంటుంది. ఈచిత్రాన్ని నేను చూశాను. టీజర్, ట్రైలర్ ని చూసిన వారంతా ఆశ్యర్యంతో ఫోన్స్ చేస్తున్నారు. ఇది హలీవుడ్ చిత్రం అనుకున్నాం అంటూ ప్రశంశలు కురిపిస్తున్నారు. జూన్ 29న విడదలవుతున్న మా సంజీవని చిత్రం తప్పకుండా విజయం సాదిస్తుందని నమ్ముతున్నాం. అని అన్నారు
Starring: Manoj Chandra, Anurag Dev, Swetha Varma, Amogh Deshapathi, Mohan, Nitin.
VFX: RockstoriesVFX, Canada; Vector Visual Magic, Hyderabad
Mountaineering Stunts: Shekhar Babu
VFX Supervision: Devi
VFX Producer: Akhil Gummadi
Sound Design: Saketh Komanduri
Camera & Editing: Venkat
Music: Sravan KK
Producer: G.Nivas
Written & Directed By Ravi Vide