‘దిల్ తో పాగల్ హై’ షూటింగ్ షురూ..
‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రవితేజ్ హీరోగా, మిస్ మహారాష్ట్ర అనిత షిండే జంటగా సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దిల్ తో పాగల్ హై’. ఎస్‌ఎమ్‌ఆర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సమర్పణలో గీతా ఫిలిమ్స్ పతాకంపై ఎస్. సోమరాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ క్లాప్‌నిచ్చారు. జైపాల్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇద్దరు ప్రేమికుల ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ కథ వినగానే సినిమా చేయడానికి ముందుకొచ్చారు నిర్మాత. జనవరి 15 తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం. మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.