GA2 పిక్చర్స్ “గీతగోవిందం” మెదటి లుక్
Category : Movie News Sliders
అర్జున్ రెడ్డి చిత్రం లో స్టార్‌డమ్ ని సంపాయించటమే కాకుండా కొట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవర కొండ హరోగా, చలో చిత్రంతో క్రేజి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంటరయ్యిన రష్మిక మందాన్న హీరోయిన్ గా శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ తో ఎంటర్‌టైన్ చేసిన పరుశురాం(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం” గీత గోవిందం”. యంగ్ టాలెంటెడ్ ప్రోడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారు సమర్పణలో GA2 PICTURES బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. “గీత గోవిందం” మెదటి లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకి సిధ్ధమవుతుంది.
చిత్ర సమర్పకులు శ్రీఅల్లు అరవింద్ గారు మాట్లాడూతూ.. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో తన యాక్టింగ్ స్కిల్స్ తో స్టార్‌డమ్ ని సంపాయించారు. గీతగోవిందం చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్లో మరో బెస్ట్ చిత్రం గా నిలుస్తుంది. ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పరుశురాం చాలా బాగా రాసుకున్నాడు. హీరోయిన్ రష్మిక పాత్ర మన పక్కింటి అమ్మాయిలా వుంటుంది. విజయ్, రష్మిక ల మద్య వచ్చే సీన్స్ బాగా రాసుకున్నాడు. పరశురాం మా బ్యానర్ లో రెండవ చిత్రం చేస్తున్నాడు. కమిట్‌మెంట్ వున్న దర్శకుడు. గోపిసుందర్ సంగీతం బాగుంది. ఆయన కూడా మా బ్యానర్ లో రెండవ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ ని మా నిర్మాత బన్ని వాసు ఎనౌన్స్ చేస్తాడు. అని అన్నారు.
దర్శకుడు పరుశురామ్ (బుజ్జి) మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు చిత్రం చేశాను. చాలా మంచి విజయాన్ని ప్రేక్షకులు అందించారు. అలాగే ఇప్పడు గీతగోవిందం లాంటి రోమాంటిక్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ చేస్తున్నాను. అల్లు అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తో బన్ని వాసు సపోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పడు టాలీవుడ్ లెటెస్ట్ సన్సెషన్ స్టార్ విజయ్ దేవర కొండ గోవిందం అనే పాత్రలో అలరించబోతున్నారు. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనే క్యూరియాసిటి అందరితో పాటు నాకు వుంది. అందుకే చాలా జగ్రత్తగా తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రని డిజైన్ చేశాను. మా గోవిందం తన యాటిట్యూడ్ ని ఎక్కడా తగ్గనివ్వకుండా చక్కటి ఫ్యామిలి ఎమెషన్స్ తో అందర్ని అలరిస్తాడు. అలాగే మా గీత అదే రష్మిక తన పాత్ర లో పరకాయప్రవేశం చేసింది అని చెప్పను..ఎందుకంటే గీత పాత్ర ఎలా వుంటుందో .. రష్మిక ఆఫ్ లైన్ అలానే వుంటుంది. మీరు రియల్ లైఫ్ రష్మిక ని స్క్రీన్ మీద చూస్తారు. ఇక మా గీతాగోవిందం చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మా మెదటి లుక్ చూస్తే వీరిద్దరి మద్య లొ వున్న కెమిస్ట్రి అర్దమయ్యే వుంటుంది.. త్వరలో మా నిర్మాత బన్నివాసు గారు వీరిద్దరి అల్లరికి ఓ డేట్ ఫిక్స్ చేసి మనకి చెప్తారు.. అని అన్నారు.
నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ.. టాలెంట్ వుంటే చాలు అదే నీకు కేరాఫ్ అంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా గీతాఆర్ట్స్ అథినేత శ్రీ అల్లు అరవింద్ గారికి నా ప్రత్యేఖ దన్యవదాలు. యూత్ , ఫ్యామిలి ఎం కొరుకుంటే అలాంటి చిత్రాలే ప్రేక్షకులకి ఇవ్వాలి.. 100 టికెట్ తో ధియెటర్ కి వచ్చే ప్రేక్షకుడు నిరుత్సాహ పడకూడదు అనే కాన్సెప్ట్ లో మమ్మల్ని పనిచేయుస్తున్న అరవింద్ గారు చిత్ర సమర్పకులు గా వుండటం చాలా ఆనందంగా వుంది. ఇక మా గోవిందం అలియాస్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. మా గీత గోవిందం చిత్రాన్ని ఆయన సపోర్ట్ మా యూనిట్ అంతా మర్చిపోలేము. విజయ్ హర్ట్ ఎంత గోప్పదో మా చిత్రం కూడా అంత గొప్పదని నా అభిప్రాయం. పరుశురాం కి ఫ్యామిలి ఎమెషన్స్ ని తెరకెక్కించటం వెన్నతో పెట్టిన విధ్య. విజయ్ దేవరకొండ మా హీరోయిన్ రష్మిక మద్య మంచి రోమాంటిక్ కామెడి సీన్స్ చాలా బాగా తెరకెక్కించాడు. గోపిసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గీత గోవిందం చేసే అల్లరి యూత్ ని ఆకట్టుకుంటాయి. త్వరలోనే విడుదల తేది ని ఎనౌన్స్ చేస్తాం.. అని అన్నారు
నటీనటులు..
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, సత్యం రాజేష్, దువ్వాసి మెహన్, గుండు సుదర్శన్, గౌతంరాజు, అనీష, కళ్యాణి నటరాజన్, సంధ్య జనక్ తదితరులు…
సాంకేతిక నిపుణులు..
సమర్పకులు.. అల్ల అరవింద్
నిర్మాత.. బన్నివాసు
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం… పరుశురామ్
సంగీతం.. గోపిసుందర్
సినిమాటోగ్రాఫర్.. మణికందన్
ఎడిటర్.. మార్తాండ్.కె.వెంకటేష్
ఆర్ట్.. రమణ వంక
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. సత్య గమిడి
స్క్రిప్ట్ కొ-ఆర్డినేటర్.. సీతారామ్
లిరిక్స్.. అనంత్ శ్రీరామ్, శ్రీమణి,
కొరియోగ్రాఫి… రఘు, జాని
పబ్లిషిటి డిజైనర్.. అనిల్ భాను
పి ఆర్ ఓ.. ఏలూరు శ్రీను