X

నితిన్‌ ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌‌

నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘అంధాధూన్’కిది రీమేక్. మార్చి 30న(మంగళవారం) నితిన్‌ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో కళ్లకు నల్లటి గాగుల్స్‌ పెట్టుకొని, చేత్తో ఓ స్టిక్‌ పట్టుకొని నడుస్తూ అంధునిగా కనిపిస్తున్నాడు నితిన్‌. పోస్టర్‌లో పియానోపై రక్తపు మరకలు కథపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.

ఇక తాజాగా విడుదలైన గ్లింప్స్‌.. సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తోంది. ఈ గ్లింప్స్‌ చూసిన ప్రతి ఒక్కరూ.. రాజా ది గ్రేట్‌ లా.. నితిన్‌ ది గ్రేట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహతిసాగర్‌ సంగీతం సినిమాపై క్రేజ్‌ని పెంచేలా ఉంది. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌. తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. నితిన్‌ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్‌ 11న విడుదల చేస్తామని కూడా చిత్రయూనిట్ ప్రకటించింది

Telugu BOX Office:
Related Post