అద్భుతమైన థీమ్ తో గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ మాదాపూర్ లో కొలువుదీరింది. ఈ రెస్టారెంట్‌కి ఎన్నో వినూత్న, విశేషాలు ఉన్నాయి. యువతను ఆకట్టుకునే విభిన్న రకాల అంశాలు, పరిసరాలు దీనికి కొత్త శోభను ఇస్తున్నాయి. రెస్టారెంట్ ప్రాంగణంలో పరచుకున్న పచ్చదనం ఆహ్లాదకరమైన అనుభూతిని అతిధులకు అందిస్తుంది. అత్యంత ఆనందదాయకమైన, హృదయాన్ని స్పర్శించే రుచుల ఆస్వాదనను అందిస్తామని నిర్వాహకులు తమ అతిధులకు హామీ ఇస్తున్నారు.
రుచులెన్నో…
థీమ్, యాంబియన్స్‌లో మాత్రమే కాకుండా గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ విభిన్న రకాల రుచులను వడ్డించడంలోనూ అతిధుల అభి‘రుచుల’కు పెద్ద పీట వేస్తోంది.
గర్ల్ ఫ్రెండ్ అరేబియన్ మండి రెస్టారెంట్ ప్రారంభ సందర్భంగా సినీ నటి పాయల్ రాజపుట్ మాట్లాడుతూ ‘‘ గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రెస్టారెంట్ పేరు కూడా చాలా కొత్తగా ఉంది మరియు థీమ్, అందమైన పరిసరాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. తమ కస్టమర్ల మనస్సులను గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్ తప్పకుండా ఆకట్టుకుంటుందని, నాణ్యమైన, రుచికరమైన ఫుడ్‌తో ఆదరణ పొందుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.
ఈ సందర్భంగా నిర్వహకులు నంద్ధిని మాట్లాడుతూ మా రెస్టారెంట్‌కి వచ్చిన కస్టమర్లు అందరికీ ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తామని మేం హామీ ఇస్తున్నాం. మాదాపూర్ సిటీ వాసులకు ఈ థీమ్ బాగా నచ్చుతుందని మా నమ్మకం. ప్రతి టేబుల్ మీదా వారికి నచ్చే వంటకాలను అందించగలమని నమ్ముతున్నాం’’అని అన్నారు