మంత్రాలయం రాఘవేంద్ర స్వామి!
మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం
తుంగభద్రా నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది కర్నూలు నుండి
100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు
ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తులతో నిర్మితమైన ఉచిత సత్రములు ఉన్నాయి.
ఇక్కడ గురువారం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు భక్తకోటిని
దీవిస్తూ ఒకరకమైన ఆహ్లాదకరంగా సందడి చేస్తుంది.
అక్టోబరు 2, 2009న తుంగభద్ర నదికి వరదలు రావడం నదీజలాలు ఉప్పొంగి మంత్రాలయాన్ని చుట్టు
ముట్టడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది
ప్రజలతో బాటు ఎక్కడెక్కడి నుంచో రాఘవేంద్రుని దర్శించడానికి వచ్చిన భక్తులు కూడా వరదనీటిలో చిక్కు
కు పోయి నానాయాతనలు పడ్డారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టాలు జరగలేదు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో
జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు.
ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ
ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో ఘోరతపస్సు
చేసాడు, ఇచ్చటనే హనుమంతుణ్ణి దర్శించాడు.
మంత్రాలయంలో తన మహిమాన్వితమైన పీఠాన్ని స్థాపించాడు.ఇచ్చటనే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.అయితే, రాఘవేంధ్ర స్వామి మహిమలు ఇన్ని అన్నీ కాకుండా ప్రచారంలో ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చేస్వామిగా ఆయన భక్తులతో కొలవబడుతున్నాడు.