ముక్తి నిచ్చే మూకాంబిక ఆలయం !
కొల్లూరు లో మూకాంబిక దేవి ఆలయం భారత దేశములోని కర్నాటక మరియు కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి. మంగళూరుకు 147 కిమీ దూరములో సౌపర్ణిక నది ఒడ్డున మరియు పచ్చని కుడజాద్రి కొండలలో ఉన్న ఈ ఆలయం ఏటా లక్షలాది యాత్రికులను ఆకర్షిస్తుంది. హిందువులు గౌరవించే ఋషి మరియు వేద పండితుడైన జగద్గురువు అది శంకరులతో ఈ ఆలయానికి అనుబందం ఉంది. సుమారు 1200 సంవత్సరాల క్రితం కొల్లూరులో మూకాంబిక దేవి ఆలయం ఒకటి నిర్మిచాలని అది శంకరులు అనుకునేలేదు. ఆదేవి కరుణతో ఆయనే ఈ్రపాంతంలో నిర్మించాల్సి వచ్చింది లేకుంటే కేరళలో నిర్మితమయ్యేది .అలా చెప్పుకునే కథనం ఒకటి ఆదిశంకరులు జీవిత చరిత్రలో ఉంది.
ఆయనే అమ్మవారి విగ్రహాన్ని తనే స్వయంగా ప్రతిష్ఠించారట. మూకాంబిక దేవిని శక్తి, సరస్వతి మరియు మహాలక్ష్మి. స్వరూపముగా భావించడంతో, భక్తులకు మూకాంబిక దేవి పై అపార విశ్వాసం పెరిగింది. కర్నాటక లోని ‘ఏడు ముక్తి స్థల’ యాత్రికా స్థలాలైన కొల్లూర్, ఉడుపి, సుబ్రహ్మణ్య, కుంబాషి, కోటేశ్వర, శంకరనారాయణ మరియు గోకర్ణంలలో మూకాంబిక దేవి ఆలయం ఒకటిగా చెబుతారు.
మూకాంబికా దేవి ఆలయం కుడజాద్రి శిఖరం క్రింద ఉంటుంది. ఆ దేవత జ్యోతిర్-లింగ రూపంలో శివ మరియు శక్తి ఇద్దరినీ కలుపుకుని ఉంటుంది. శ్రీ చక్ర మీద ఉన్న ఆ దేవత యొక్క పంచలోహ మూర్తిని (ఐదు లోహాల మిశ్రమము) ఆది శంకరాచార్యులు ఆ ప్రాంతాన్ని ఆచల్లని తల్లిని తనతో తీసుకు వస్తూ అక్కడ ప్రతిష్ఠించాల్సి వచ్చినందున ప్రతిష్టించారు. దేవత యొక్క మొట్టమొదటి స్థానం కుడజాద్రి శిఖరం మీద ఉండేదని, సర్వజనులు కొండ ఎక్కి వెళ్ళటం చాలా కష్టమవడంతో, శంకరాచార్యులు ఆ దేవాలయాన్ని కోలూర్ లో తిరిగి స్థాపించారని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడి పంచముఖ గణేశ యొక్క శిల్ప నిర్మాణం విశిష్టంగా ఉంటుంది.
కొల్లూర్ శ్రీ మూకాంబికా దేవాలయములోని ఇతర దేవతలు శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ పార్థేశ్వర, శ్రీ పంచముఖ గణపతి, శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీ ప్రాణలింగేశ్వర, శ్రీ నంజుండేశ్వర, శ్రీ ఆంజనేయ, శ్రీ వెంకటరమణ, శ్రీ తులసి గోపాలకృష్ణలు.నవంబరులో జరిగే నవరాత్రి ఉత్సవాలలో, ఆ దేవాలయం భక్తులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ జన్మాష్టమి లేదా కృష్ణ జయంతి కూడా ఒక ప్రముఖ పండుగే. స్వయం భూలింగ ఈ రోజునే కనిపించిందని నమ్ముతారు.
నవరాత్రి పండుగలో ఆఖరి రోజున సరస్వతీ మంటపంలో విద్యారంభ లేక చిన్న పిల్లలకు వారి మాతృభాషలో అక్షరాలు నేర్పడం ప్రారంభించడం జరుగుతుంది. అయినా కూడా దేవాలయంలో, మరేదైనా వీలుపడిన రోజున కూడా విద్యారంభ జరుపుకోవచ్చు. భక్తులకు ప్రతి రోజు మధ్యాహ్నము మరియు సాయంత్రము ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుంది.
ఆలయానికి మార్గం
కొల్లూర్ మూకాంబిక మెటల్ రోడ్డు ద్వారా చేరుకునే వీలు కలిగి ఉండి, మంగుళూరు, ఉడుపి, మరియు కుందాపూర్ నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. కొంకణ్ రైల్వే దారిలోని కుండాపూర్ లేక మూకాంబికా రోడ్డు ( బైన్డూర్) లు అత్యంత చేరువలో ఉన్న రైల్వే స్టేషన్లు.
నివాస వసతులు
కొల్లోర్ లో అనేక లాడ్జింగ్లు ఉన్నాయి. దేవాలయ దేవస్వాం సౌపర్ణిక అనే ఒక వసతిగృహాన్ని నిర్వహిస్తుంది. శ్రీ లలితాంబికా వసతిగృహం, మాతా ఛత్రం వసతి గృహం, గోయంకా వసతి గృహం మొదలగునవి కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద ఈ సదుపాయాలతో దాదాపుగా 400 గదులు ఉన్నాయి. గది అద్దెలు సామాన్య భక్తులకు అందుబాటులోనే ఉంటాయి. ఒంటరి సందర్శకులకు బస్సు స్టాండు సముదాయము యొక్క ఆవరణలోనే ఒక డార్మిటరీ ఉంది. మరొక సదుపాయం అయిన అతిథి మందిర రామకృష్ణ యోగాశ్రమంచే నిర్వహించబడుతుంది.
పురాణా చరిత్ర
పురాణాల ప్రకారం, కోల మహర్షి ఇక్కడ తపస్సు చేస్తుండగా, శివ భగవానుని మెప్పించి, వరం పొందడానికి తపస్సు చేసుకునే ఒక రాక్షసుడి వలన ఆయన మనోవిచలితులయ్యాడు. ఆ రాక్షసుడు తన దుష్ట కోరిక నేరవేర్చుకోకుండా ఉండడానికి, ఆది శక్తి అతనిని మూగవానిగా (మూక) చేయగా, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఏమీ అడగలేకపోయాడు. దానితో అతను కోపధారి అయి, కోల మహర్షిని వేధించగా, ఆయన ఆది శక్తిని రక్షించమని వేడుకున్నారు. మూకాసురుని సంహరించిన ఆది శక్తిని దేవతలదరూ మూకాంబికగా స్తుతించారు. కోల మహర్షి యొక్క పూజ వద్ద దైవ మాత మిగిలిన అందరు దేవతలతో సహా ఉండిపోయి, భక్తులతో పూజింపబడుతుంది.
శ్రీ ఆది శంకరాచార్యకు శ్రీ మూకాంబికా దేవి కలలో కనిపించగా, ఆయన ఈ దేవత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని నమ్ముతారు.ఆ కథ ఇలా నడుస్తుంది. ఆది శంకర కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్నపుడు, దేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై నీ కోరిక ఎరింగింపుము అని దేవి అడిగింది. ఆయన దేవిని కేరళలోని ఒక ప్రాంతంలో తాను పూజ చేసుకునేందుకు వీలుగా ప్రతిష్ఠించాలనే తన కోరికను తెలిపారు.దేవి దానికి అంగీకరించి, ఆది శంకరునితో బయల్దేరడానికి సిద్దపడింది. అయితే వెనుకనే వస్తాను. గమ్యం చేరే వరకు వెనక్కి తిరిగి చూడరాదని తెలిపింది. అందుకు శంకరుడు అంగీకరించాడు. అలా వెడుతుండగా దేవి యొక్క కాలి గజ్జల శబ్దం వినబడకపోవడంతో, శంకరులు హఠాత్తుగా తిరిగి చూశాడు. వెంటనే దేవి విగ్రహంగా మారిపోయింది. తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని ఇక్కడే ఆపని నిర్విగ్నంగా చేయమని ఆదేశించింది. అలానే శంకరులు విగ్రహప్రతిష్టచేసారు.
దేవాలయ పూజా క్రమం
ఉదయం 5 గంటలకు దేవాలయ నడ తెరుచుకుంటుంది. నిర్మాల్యదర్శన
ఉదయం 6 గంటలకు ఉషా పూజ
ఉదయం 7 గంటల ముప్పై నిముషాలకు మంగళ ఆరతి
ఉదయం 8 గంటల ముప్పై నిముషాలకు బలి
ఉదయం 11 గంటల ముప్పై నిముషాలకు ఉచ్చ పూజ
ఉదయం 12 గంటలకు మహా నైవేద్య
మధ్యాహ్నం 12 గంటల ముప్పై నిముషాలకు మహా మంగళ ఆరతి
మధ్యాహ్నం 1 గంటకు బలి
మధ్యాహ్నం 1 గంట ముప్పై నిముషాలకు నడ మూసుకుంటుంది
మధ్యాహ్నం 3 గంటలకు నడ తెరుచుకుంటుంది
సాయంత్రం 6 గంటలకు ప్రదోష పూజ
సాయంత్రం 7 గంటలకు సలాం మంగళ ఆరతి మరియు నైవేద్యం
సాయంత్రం 7 గంటల ముప్పై నిముషాలకు మంగళ ఆరతి
సాయంత్రం 8 గంటలకు బలి మంగళ ఆరతి
సాయంత్రం 8 గంటల ముప్పై నిముషాలకు బలి ఉత్సవ. సరస్వతి మండపంలో అష్టావధాన పూజ
సాయంత్రం 9 గంటలకు కషాయ మంగళ ఆరతి దేవాలయం నడ మూసుకుంటుంది.
శ్రీ దేవీ మూకాంబిక యొక్క అలంకృత ఆభరణాలు
ఆ దేవాలయంలో ఒక పెద్ద ఆభరణాల నిధి ఉంది. అవి దేవి యొక్క దీవతలతో తమ కలలు, కోరికలు తీరిన గుర్తుగా భక్త సమాజం ఇచ్చిన కానుకలు. దేవికి ఉన్న అనేక నగలలో, మరకతం ఉన్న నగ ఎంతో విలువైనది. మరకతము జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ దేవాలయానికి, బహిరంగ ప్రదర్శనకు గానూ రెండు బంగారు దేవతా విగ్రహాలు ఉన్నాయి. అసలు విగ్రహము పోవడంతో, రాణీ చెన్నమ్మ దానికి బదులుగా బహుకరించిన విగ్రహం ఒకటి ఉంది.
తరువాత ఆ పోయిన విగ్రహం దొరకడంతో, ఇప్పుడు రెండు విగ్రహాలు ఉన్నాయి. గతంలో తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎం.జీ.ఆర్. ఒక కిలో బరువు మరియు రెండున్నర అడుగుల పొడవు ఉన్న ఒక బంగారు కత్తిని బహుకరించారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి అయిన శ్రీ గుండూ రావు అదే రకంలో వెండితో చేసిన కత్తిని బహుకరించారు. మూకాంబికా దేవత యొక్క ముఖ తొడుగు పూర్తి బంగారంతో తయారు చేయబడి, విజయనగర సామ్రాజ్యం వారిచే బహుమతిగా ఇవ్వబడింది. జ్యోతిర్లింగ యొక్క బంగారు ముఖ తొడుగు మరొక ప్రత్యేక ఆభరణము