‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’…. యూట్యూబ్‌లో రికార్డుల మోత
Category : Behind the Scenes Movie News Sliders videos
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజైన ఈ సాంగ్ లిరికల్ వీడియో Youtubeలో ట్రెండ్ అవుతూ భారీ వ్యూస్‌ను రాబడుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ ఈ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఇప్పటికే ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన ‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్‌కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో సమంత ఆడిపాడగా… యూట్యూబ్‌లో ఇప్పటి వరకు అన్ని బాషల్లో కలిపి 45 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు 1.6 మిలియన్స్‌కు పైగా లైక్స్ రావడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.