ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’

గతేడాది నేచురల్ స్టార్ నాని నటించిన పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నానీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానీ బెంగాలీ యువకుడిగానూ, ఒక ఫిల్మ్ మేకర్ గానూ రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. కథానాయికగా సాయిపల్లవి అత్యుత్తమ నటనను కనబరిచింది. స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్ లోని ఒక ప్రాంతంలో జరిగే అనాచారాలపై తిరుగుబాటు చేసే యువకుడిగా నానీ చాలా పవర్ ఫుల్ పాత్రను పోషించారు. కృతిశెట్టి మరో కథానాయికగా నటించగా.. రాహుల్ రవీంద్రన్, మడోనా సెబాస్టియన్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా, శుభలేఖ సుధాకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఓటీటీలో కూడా ఈ సినిమా విశేష ప్రజాదరణ పొందింది. అలాంటి ఈ సినిమా మూడు కేటగిరిస్‌లో ఆస్కార్ బరిలో నిలిచింది.

‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని పిరియాడిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భారతీయ సాంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో ఆస్కార్ పరిశీలనకు పంపినట్టు సమాచారం. ఈ విషయం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలై. అక్కడ కూడా మంచి వసూళ్ళను రాబట్టింది.

వాసుదేవ్ ఒక మంచి దర్శకుడు. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి పేరు తెచ్చుకొని ఆ తర్వాత సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అతడ్ని పూర్వ జన్మ వెంటాడుతుంది. తను క్రిందటి జన్మలో ప్రముఖ బెంగాలి రచయిత శ్యామ్ సింగరాయ్ నని అర్ధమవుతుంది. ఇంతకీ ఎవరా శ్యామ్ సింగరాయ్ ? అతడి కథాకమామిషేంటి? అన్నదే మిగతా కథ. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా.. ఈ సినిమా కథాంశాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలోకి దిగడం గొప్ప విషయం.


అదరగొట్టిన నాని… శ్యామ్ సింగరాయ్ ట్రైలర్

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‏లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే కాసేపటి క్రితం శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకుంటున్న కుర్రాడికి.. శ్యామ్ సింగరాయ్‏కు గల అనుబంధం ఏంటీ అనేది ట్రైలర్‏లో చూపించారు. పిరికివాళ్లే కర్మ సిద్ధాంతాన్నే మాట్లాడతారు.. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమాం గోప్పది కాదు… తప్పని తెలిసాక.. దేవుడ్ని కూడా ఏదిరించడంలో తప్పు లేదు అని నాని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. కలకత్తా బ్యాక్‏డ్రాప్‏లో పిరియాడిక్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


‘నాగలక్ష్మి’ అదిరింది

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా.. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బంగార్రాజు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సూపర్ హిట్ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా అలరించిన నాగ్ బంగార్రాజు పాత్రకిది ఎక్స్‌టెన్షన్. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉండగా.. చైతూ సరసన కథానాయికగా నటిస్తోన్న కృతిశెట్టి నాగలక్ష్మి పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. చీరకట్టుతో మెరిసిపోతూ.. మెడలో దండలతో రివీలైన ఆమె మేకోవర్ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది.


‘శ్యామ్ సింగ రాయ్’ వచ్చేశాడు.. అదరగొడుతున్న టీజర్

అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ..’శ్యామ్ సింగ రాయ్‌’ అంటూ టీజర్‌తో వచ్చేశాడు నాని. ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్‌’. తాజాగా ఈ సినిమా టీజర్‌ వచ్చి ఆకట్టుకుంటోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు.

డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్‌’ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే మేకర్స్ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సినిమాకు హైలెట్‌గా నిలవబోతోందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మధ్యకాలంలో నానికి సాలీడ్ హిట్ దక్కలేదు. దీంతో ‘శ్యామ్ సింగ రాయ్‌’ తో నాని హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..