పెళ్లి తర్వాతా తగ్గని క్రేజ్… రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నయన్

పెళ్లి తర్వాతా తగ్గని క్రేజ్… రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నయన్

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రేంజ్ స్టార్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. తెలుగు, తమిళ బాషల్లో స్టార్ హీరోలందరితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నయన్.. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకుంది. ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న నయనతారు.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’‌లో కీ రోల్ పోషిస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినా ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. దీంతో పాటుగా హిందీలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ హీరోయిన్ గా నటించింది..ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. అయితే నయనతారకు సంబంధించి ఓ కీలక సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా పెళ్లి తర్వాత క్రేజ్‌తో పాటుగా సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. అయితే ఇందుకు భిన్నంగా నయనతారకి ఇసుమంత కూడా డిమాండ్ తగ్గలేదు. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ షో మాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడం నయనతార స్పెషాలిటీ. అందుకే అందరు డైరెక్టర్లు ఆమెతో పని చెయ్యడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. తనకున్న డిమాండ్‌ని బట్టి నయనతార పెళ్లయిన తర్వాత పారితోషికం బాగా పెంచేసినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటివరకు రూ.4-6కోట్ల పారితోషికం తీసుకునే ఈ బ్యూటీ ఇప్పుడు రూ.10కోట్లు డిమాండ్ చేస్తోందట. అయితే ఆమెకున్న క్రేజ్‌ని బట్టి ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు కూడా వెనకడుగు వేయడం లేదట.

కేవలం నయనతార కోసమే సినిమాలు చూసే ప్రేక్షకులు తెలుగు, తమిళ భాషల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. నయనతార ఒక సినిమా ఒప్పుకుందంటే కచ్చితంగా ఏదో విశేషం ఉంటుందని బలంగా నమ్ముతుంటారు. అందుకే ఆమె తన బ్రాండ్ కి తగ్గ పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నయనతారకి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఈ సంస్థ ద్వారా తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూ కొత్తవాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇస్తోంది నయనతార.


చిరంజీవి చెల్లెలిగా నయనతార.. రెమ్యునరేషన్ మరీ ఇంతా?


ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ నయనతార హవా కొనసాగుతోంది. వయసు పైబడుతున్నా ఆమె రేంజ్‌ పెరుగుతోందో గానీ.. ఎక్కడా తగ్గడం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించనుంది. ‘సైరా నరసింహారెడ్డి’ లో చిరుకు భార్యగా నటించిన నయన్.. తాజా సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం.

అయితే ఈ సినిమా కోసం నయనతార ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. నయనతార నటించడం వల్ల ఇతర భాషల్లో కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్మాతలు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందువల్లే ఈ రోల్‌కి నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా కోసం నయన్‌ తీసుకున్న పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.4కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.మునుపెన్నడూ లేనివిధంగా ఆమె పవర్ ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారట.

‘గాడ్ ఫాదర్’ సినిమా విషయానికి వస్తే కొణిదెల ప్రొడెక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నయనతార భర్తగా ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఈ సినిమాలో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది.