వి.వి.వినాయక్ చేతుల మీదుగా ‘నిన్ను చేరి’ వెబ్ సిరీస్ లోగో లాంచ్
Category : Behind the Scenes Latest Events Movie News Sliders
తేజా హనుమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లుగా గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ ‘నిన్ను చేరి’. సాయికృష్ణ తల్లాడ డైరెక్షన్ చేసిన ఈ వెబ్ సిరీస్ టైటిల్ లోగోను హోలీ పండుగ సందర్భంగా ఈ సిరీస్ టైటిల్ లుక్ ని ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్‌గా శంకర్ అందరికీ సుపరిచితుడు. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకి, నిన్ను చేరి టీమ్‌కి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
నిర్మాత శంకర్ కొప్పిశెట్టి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 175 సినిమాలకి డిస్ట్రిబ్యూటర్‌గా చేశాను, ఇప్పుడు నిర్మాతగా మారి నిన్ను చేరి అనే వెబ్ సిరీస్ ని నిర్మించాను. ఈ సిరీస్ లోగోని మా అన్నయ్య వి.వి.వినాయక్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది, అలానే మా డైరెక్టర్ సాయికృష్ణ అండ్ మా టీం బాగా కష్ట పడి మంచి అవుట్ ఫుట్ వచ్చేలా ఇష్టపడి పని చేశారు.
డైరెక్టర్ సాయికృష్ణ తల్లాడ మాట్లాడుతూ.. నేను సినిమాలు చేస్తున్నప్పుడు విడుదల సమయంలో థియేటర్లల్లో సరైన టైమ్‌కి విడుదల అయ్యేలా శంకర్ గారు హెల్ప్ చేశారు. అప్పుడే సినిమా మీద ఆయనకున్న గౌరవం తెలుసుకున్నాను. అలాంటి డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు నిర్మాతగా మారి నన్ను వారి బ్యానర్లో నేను డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. చిన్నప్పుడు ఆది, లక్ష్మి లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు వి.వి.వినాయక్ సార్‌ని ఒక్కసారైనా కలవాలని అనుకునే వాడిని. అలాంటిది ఈ రోజు ఆయన చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మా టీం అందరూ కరోనా టైమ్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాజెక్ట్ ని షూట్ చేసాం’ అని తెలిపారు.
‘నిన్ను చేరి’.. టీమ్
నటీనటులు: రాజు అనేం, మాధురి, బేబీ హాసిని, గౌతమ్ రాజు, భద్రం, కిషోర్ దాసు, శాంతి స్వరూప్ తదితరులు.
కథ మాటలు: శివ కాకు,
సంగీతం: వి.ఆర్.ఏ.ప్రదీప్,
సౌండ్ ఎఫెక్ట్స్: వెంకట్,
గ్రాఫిక్స్: రాహుల్ ,
బ్యానర్: తేజా హనుమాన్ ప్రోడక్షన్స్,
నిర్మాత: శంకర్ కొప్పిశెట్టి,
డైరెక్టర్: సాయికృష్ణ తల్లాడ