Radhe shyam Trailer: ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?
Category : Behind the Scenes Daily Updates Movie News Sliders Teasers Trailers
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘రాధే శ్యామ్’. తాజాగా చిత్రబృందం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా మీద బజ్‌ను మరో స్థాయిలో పెంచేసింది.
ఇన్నాళ్ళు ఈ సినిమా ఎలా ఉంటుందో అని కొందరికి కొన్ని రకాల సందేహాలున్నాయి. ఆ సందేహాలన్నిటిని ‘రాధే శ్యామ్’ ట్రైలర్ ఇట్టే తీర్చేసింది. ఇక ఈ సినిమాను థియేటర్స్‌లో చూడటమే తరువాయి అనేట్టుగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.