ఆ విషయంలో హద్దులేమీ పెట్టుకోలేదు: ‘శశి’ హీరోయిన్ సుర‌భి

ఆ విషయంలో హద్దులేమీ పెట్టుకోలేదు: ‘శశి’ హీరోయిన్ సుర‌భి

ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల నటి సురభి.. బీరువా, ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌, ఒక్కక్షణం, ఓటర్‌ సినిమాల‌తో మెప్పించింది. ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’లో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. మార్చి 19న ‘శశి’ విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా హీరోయిన్ సుర‌భితో ఇంట‌ర్వ్యూ విశేషాలు..

నిర్మాత‌లు నాకు ఫోన్ చేసి డైరెక్టర్‌తో మూడున్నర‌ గంట‌లు క‌థ నేరేట్ చేయించారు. స్టోరీ విన‌గానే చాలా థ్రిల్‌గా ఫీలై వెంటనే సైన్ చేశాను. ఈ సినిమా రెగ్యుల‌ర్ ల‌వ్‌స్టోరీ కాదు. ఎమోష‌న్స్‌, ఇంటెన్సిటీతో కూడిన ర‌గ్‌డ్ ల‌వ్‌స్టొరీ. అందుకే ఈ సినిమాలో ఆది లుక్ అంత ర‌గ్‌డ్‌గా ఉంది. చాలా అంశాల‌తో కూడిన ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఈ సినిమాలో న‌ట‌న‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర నాది. ఆడియ‌న్స్‌కి తప్పకుండా ఒక ఇంపాక్ట్ అయితే చూపుతుంది. ఈ మూవీలో రాజీవ్ క‌న‌కాల నాకు తండ్రిగా నటించారు. ఒక్క కూతురునే కాబ‌ట్టి చాలా గారాబంగా పెంచుతాడు. నిజ జీవితంలోనూ నేను మా పేరెంట్స్‌కి ఏకైక కూతురిని. అందుకే ఈ సినిమాలో నా పాత్రతో వెంట‌నే క‌నెక్ట్ అయ్యాను.

కాలేజ్‌లో నా బ్యాచ్‌తో క‌లిసి ర్యాగింగ్ చేసే స‌న్నివేశాలు చాలా ఫ‌న్నీగా ఉంటాయి. నాది ఒక డామినేటింగ్ ప‌ర్సనాలిటీ. అయితే ఈ సినిమాలో నా క్యారెక్టర్లో మ‌రో షేడ్ ఉంటుంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. నాతోపాటు ఈ సినిమాలో ప్రతి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది.

ఈ సినిమాలో ఆదికి మ్యూజిక‌ల్ బ్యాండ్ ఉంటుంది. గిటార్ ప్లే చేస్తాడు. ఒక మంచి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకునే క్యారెక్టర్ నాది. నేను ఎందుకు అలా చేసుకోవాలి అనుకుంటాను అనే రీజ‌న్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆదితో ఫ‌స్ట్‌టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆయన చాలా హంబుల్ పర్సన్‌. వెరీ వెరీ డౌన్ టు ఎర్త్‌. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వ‌చ్చినా అస‌లు ఆ ఫీలింగ్ ఉండ‌దు. చాలా మంచి డ్యాన్సర్ కూడా. కొన్ని స‌న్నివేశాల్లో నాకు చాలా స‌పోర్ట్ చేశారు. అలాగే నిర్మాత వ‌ర్మగారు మోస్ట్ నైస్ ప‌ర్సన్‌. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫుల్ స‌పోర్ట్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రోజూ సెట్‌కి వ‌చ్చి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చేవారు.

‘శశి’ పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉంది. ‘ఒకే ఒక లోకం’ పాట 50 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసింది. ఆ క్రెడిట్ మొత్తం మ్యాజిక్ డైరెక్టర్ అరుణ్‌కే చెందుతుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, వైవా హర్ష పాత్రలు హిలేరియ‌స్‌గా ఉంటాయి. ‘శశి’ ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు ట్రైల‌ర్ చూసి చాలా బాగుంది అన్నారు. టీమ్ అంద‌రూ చాలా క‌ష్టప‌డి సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, దాని ద్వారా నాకు మరిన్ని ఛాన్సులు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటివ‌ర‌కూ 13 సినిమాలు చేశాను. అందులో తమిళమే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తెలుగులోనూ మంచి ఛాన్సులు వ‌స్తున్నాయి.

గ్లామ‌ర‌స్ రోల్స్ చేయ‌డానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటాను. ఇండ‌స్ట్రీలోని గ్రేట్ పీపుల్స్ అంద‌రితో వ‌ర్క్ చేయాల‌న్నది నా కోరిక. అలాగే మైథాలాజిక‌ల్ మూవీస్‌లో న‌టించ‌డం ఇష్టం. వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌‌నే చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తాను.