రామ్‌చరణ్ ఇన్‌స్టా స్టిల్స్
- Home
- Tagtollywood
- July 3, 2022
-
-
-
-
- June 24, 2022
-
-
లోక్‌సభలో అడుగుపెట్టిన తొలి సినీనటుడు ఈయనే!
Category : Behind the Scenes Movie News Sliders Top Trending
రాజకీయాల్లో సినిమా వాళ్లు చక్రం తిప్పడం సర్వసాధారణం. టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా మేకప్ వేసుకుని సినిమాలో రాణించినవారు ఆ తరవాత రాజీకీయాల్లో చక్రం తిప్పారు. తమిళంలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, తెలుగులో ఎన్టీఆర్.. ఇలా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు రాజకీయ నాయకులుగానూ రాణించారు. తెలుగు నాట పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే సీఎం స్థాయికి ఎదిగారు. కానీ ఎన్టీఆర్ కంటే మందే ఓ తెలుగు నటుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో రాణించారన్న విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన ఎవరో కాదు కొంగర జగ్గయ్య. దేశంలో సినిమా రంగం నుండి వచ్చి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటిన తొలినటుడు కూడా ఆయనే. సినీ రంగం నుంచి వచ్చి లోక్‌సభకు ఎన్నికైన తొలినటుడిగా రికార్డు నెలకొల్పారు. కొంగర జగ్గయ్య ఎన్టీఆర్‌కు సన్నిహితుడు కావడం విశేషం.
కొంగర జగ్గయ్య గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ గ్రామంలో ధనవంతుల కుటుంబంలో జన్మించారు. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాడు. అదే కాలేజీలో ఎన్టీఆర్ కూడా విద్య అభ్యసించారు. అక్కడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఎన్టీఆర్‌తో కలిసి అనేక నాటకాలు వేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే జగ్గయ్య రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. అనంతరం ఆయన ప్రయాణం సినిమాల వైపు మళ్లింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత జగ్గయ్య వరుసగా మూడు సంవత్సరాల పాటు ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు. జయప్రకాష్ స్థాపించిన ప్రజా సోషలిస్ట్ పార్టీతో జగ్గయ్య రాజకీయ ప్రస్థానం మొదలైంది. అనంతరం 1956లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1967లో ఒంగోలు నుండి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లోనే ఆయనకు 80వేల మెజారిటీ రావడం విశేషం. ఎంపీగా గెలిచిన తరవాత ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల మనసుల్లో నటుడిగానే కాకుండా మంచి ప్రజానాయకుడిగా నిలిచిపోయారు.
-
-
తెలుగు సినిమా హాస్యానికి చిరునామా ‘జంధ్యాల’
Category : Behind the Scenes Daily Updates Movie News Sliders
తెలుగు తెరపై ఆయన పండించిన నవ్వుల పంట మరెవరికీ సాధ్యం కాలేదు. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చంటబ్బాయి. తన సినిమాలతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేసిన హై హై నాయకుడు. హాస్య చిత్రాలు ఉన్నంత కాలం గుర్తుండిపోయే అమరజీవి. ఆయనే కామెడీ చిత్రాల కేరాఫ్ అడ్రస్ హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. నవ్వడం ఒక యోగం., నవ్వించడం ఒక భోగం., నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పిన హాస్యబ్రహ్మ. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన కామెడీ మార్క్ ఉండేలా జాగ్రత్త తీసుకునే హాస్య చక్రవర్తి జంధ్యాల.
జంధ్యాల పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తితో కొన్ని నాటకాలు రచించారు. అలా నాటకాలు రాస్తూనే కళాతపస్వీ కె.విశ్వనాథ్ గారి దృష్టిలో పడ్డారు. రచయితగా జంధ్యాల గారి తొలి చిత్రం ‘సిరిసిరి మువ్వ’. మొదటి చిత్రంతోనే తనదైన పంచ్ డైలాగులతో, కామెడీ టైమింగుతో పరిశ్రమలో పలువురిని ఆకర్షించారు. ‘శంకరాభరణం’ వంటి క్లాస్ చిత్రాలకు సంభాషణలు అందిస్తునే… ‘అడవిరాముడు’, ‘వేటగాడు’ వంటి మాస్ సినిమాలకు డైలాగ్స్ రాస్తూ తన కలానికి రెండు వైపులా పదును ఉందని నిరూపించుకున్నారు జంధ్యాల . మాటల రచయతగా ప్రారంభమైన ఆయన సినీ కెరీర్.. ఆ తర్వాత దర్శకుడి అవతారమెత్తి అనేక హాస్య చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కుటుంబ సభ్యులందరూ కూర్చొని చూసే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు అందించారాయన. డైరెక్టర్‌గా తొలి చిత్రం ‘ముద్ద మందారం’తో సక్సెస్ అందుకున్నారు.
ఎంతో మంది కామెడీ నటీనటులను తెలుగుతెరకు అందించిన ఘనత జంధ్యాల గారిది. ముఖ్యంగా సుత్తి జంటైన వీరభద్రరావు గారు , వేలు గారిని ‘నాలుగు స్తంభాలాట’ సినిమాతో వెండితెరకు పరిచయం చేసారు. ఆ తర్వాత ఈ సుత్తి జంట ఎన్నో చిత్రాల్లో తమ కామెడీ టైమింగ్‌తో ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత జంధ్యాలకే దక్కుతుంది. తెలుగు వారందరికీ పరిచయమైన బ్రహ్మానందాన్ని ‘అహనా పెళ్లంట’ చిత్రంతో స్టార్ కమెడియన్ చేసిన గొప్ప దర్శకులు జంధ్యాల. ‘ఒరేయ్ అరగుండు వెధవ’ అని కోట గారితో బ్రహ్మానందం గారిని తిట్టించినా అది జంధ్యాలకే మాత్రమే చెల్లింది. బ్రహ్మానందం కామెడీ స్టార్‌గా ఎదగడంలో ఆయన పాత్ర మరిచిపోలేనిది. తన మార్క్ డైలాగ్స్ తో ప్రేక్షకులను థియోటర్లకు రప్పించడంలో అయనది అందెవేసిన చేయి. దరిద్ర నారాయణుడికి దిక్కు మాలిన స్వరూపం అని వర్ణించినా…. పాండు రంగారావును జేమ్స్ పాండ్ చేసినా…హై హై నాయకాలో బూతు బూతు అని వినీ వినిపించని బూతులు తిట్టించినా…శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో శ్రీలక్ష్మీతో సినిమా స్టోరీ చెప్పించినా… ‘జయమ్ము నిశ్చయమ్మురా’ బాబూ చిట్టి అని శ్రీ లక్ష్మీతో వెరైటీ డైలాగ్స్ పలికించినా అది ఒక్క జంధ్యాల గారికే సొంతం. తెలుగు వారిని తన నవ్వులతో ముంచిన హాస్య బ్రహ్మ 2001 జూన్ 19న హాస్య ప్రియులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణించినా తన చిత్రాలతో నేటికి హాస్యప్రియులను తన సినిమాలతో నవ్విస్తునే ఉన్నారు.
- June 17, 2022
-
-
‘విరాటపర్వం’ రివ్యూ
Category : Latest Reviews Sliders
టైటిల్ : విరాటపర్వం
నటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్, జరీనా వాహబ్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు
దర్శకత్వం : వేణు ఊడుగుల
సంగీతం : సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
విడుదల తేది : జూన్ 17, 2022
డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, ఈశ్వరి రావు, జరీనా వాహబ్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబుతో పాటు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేష్ బొబ్బలి సంగీత దర్శకత్వంలో, దివాకర్ మణి, డాని సాంచేజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. రానా, సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ ఆసక్తిని మరింత పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్‌లో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం…
విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలో సాగుతుంది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెలకు జన్మనిస్తుంది ఆమె తల్లి(ఈశ్వరీరావు). ఆమెకు పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్). ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్ దళ నాయకుడు అరణ్య అలియాస్ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి ఆయనతో ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్, ఈశ్వరీరావు) ఆమెకు మేనబావ(రాహుల్ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్న కోసం ఊరూరు వెతికి.. అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది. కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? వెన్నెల మావోయిస్టులను కలిసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవన్నపై ప్రేమతో నక్సలైట్‌గా మారిన వెన్నెల చివరకు వారి చేతుల్లోనే చనిపోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్‌లో ‘విరాటపర్వం’ చూడాల్సిందే.
విరాటపర్వం కథలో ఎంతో మంది నటీనటులున్నారు. భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర), శకుంతల (నందితా దాస్) ఇలా ఎన్నెన్నో పాత్రలున్నాయి. కానీ అందరి దృష్టి మాత్రం వెన్నెలగా నటించిన సాయి పల్లవి మీదే పడుతుంది. ఆ తరువాత రవన్నగా రానా పాత్రపై అందరికీ ఆసక్తి పెరుగుతుంది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించేసింది. కొన్ని సీన్లలో కన్నీరు పెట్టించేస్తుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ చేసిన సమయంలో విజిల్స్ వేయిస్తుంది. అలా సాయి పల్లవి పూర్తిగా స్క్రీన్‌ను ఆక్రమించేసుకున్నట్టు అనిపిస్తుంది. రానా సైతం తన ఆహార్యంతోనే అందరినీ మెప్పిస్తాడు. రవన్న కారెక్టర్‌లో దళనాయకుడిగా ఆకట్టుకుంటాడు. రానా నటన, గంభీర్యమైన వాక్చతుర్యం పాత్రను మరింతగా ఎలివేట్ చేసింది. మిగతా పాత్రధారులైన ఈశ్వరీరావు, సాయి చంద్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ, నివేదా పేతురాజ్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో అవలీలగా నటించేశారు.
విరాట పర్వం యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారనే విషయం తెలిశాక.. వెన్నెల పాత్ర ఎవరో కాదు తూము సరళే అని తెలిశాక.. నాడు జరిగిన ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. నాటి సరళ విషాద ఘట్టానికి సంబంధించిన వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే నక్సలైట్లే సరళను చంపేశారని అందరికీ తెలిసిందే. విరాట పర్వం కథను దర్శకుడు ఏ కోణంలో చూపిస్తాడు.. ఆ హత్యను ఎలా సమర్థిస్తాడు.. ఏవిధంగా చూపిస్తాడు..ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు.. అని నిర్ణయిస్తాడు అనే దాని మీద అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే దర్శకుడు వేణు మాత్రం ఇక్కడ ఆ సున్నితమైన అంశాన్ని ఎంతో హృద్యంగా, గుండె బరువెక్కేలా చిత్రీకరించాడు. సరైన జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఓ అందమైన ప్రేమ కథను అల్లేశాడు. ఈ సినిమా విషయంలో ఎంతో లిబర్టీ తీసుకున్నట్టు కనిపిస్తుంది. దళసభ్యులే అనుమానంతో కోవర్టు అని చంపినా దానికి దారి తీసిన కారణాలు, అనుమానం రావడానికి గల సంఘటనలను అద్భుతంగా పేర్చాడు. చివరకు పోలీసులు పన్నిన వలలో భాగంగానే దళ సభ్యులు అలా చేయాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పేశాడు. తప్పు ఎవరిది? ఒప్పు ఎవరిది.. ఈ పాపం ఎవరిది అంటూ ఇక చివర్లో వేసిన విషాద గీతంతో తాను చెప్పదల్చుకున్నది చెప్పేశాడు. ప్రేక్షకుల తీర్పుకు వదిలేసినట్టుగా అనిపిస్తుంది.
దర్శకుడు వేణు స్వతహా రచయిత కావడంతో మాటలు తూటాల్లా పేలాయి. ‘మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్’అని రాహుల్ రామకృష్ణతో చెప్పించి.. అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో చూపించాడు. ‘మీరాభాయి కృష్ణుడు కోసం కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను వదిలేసి ఎలా వెళ్లిపోయిందో! అలానే నేను నీకోసం వస్తున్నాను’ అంటూ వెన్నెలతో చెప్పించి రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి తెలియజేశాడు. ‘తుపాకీ గొట్టంలో శాంతి లేదు… ఆడపిల్ల ప్రేమలో ఉంది’, ‘చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు’, ‘రక్తపాతం లేనిదెప్పుడు చెపు.. మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉంది’, నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తల రాతల్లో కచ్చితంగా నేనే ఉన్నా’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే తెలంగాణలో అప్పట్లో ఎలాంటి పరిస్థితులు ఉండోవో, ప్రజల జీవన పరిస్థితి ఏరకంగా ఉండేదో చక్కగా చూపించాడు. మొత్తంగా దర్శకుడు వేణు ఊడుగుల ఓ స్వచ్చమైన ప్రేమ కథను.. అంతే స్వచ్చంగా తెరకెక్కించాడు.
- January 11, 2022
-
-
రోజుకు 24 ఇడ్లీలు.. 2 లీటర్ల బాదం పాలు, 40 బజ్జీలు.. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే షాకే..
Category : Behind the Scenes Celebrity Movie News Sliders
తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పిన నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన తన ప్రతిభ చాటుకొని, ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇక శ్రీకృష్ణ, శ్రీరామ వంటి పౌరాణిక పాత్రల పోషణతో ఆయన్ని నిజంగా దైవంగా భావించేవారు ఎందరో. కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత రెండు షిఫ్టులు మాత్రమే వర్క్ చేసేవారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక సినిమాకి, రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మరో సినిమాకు ఆయన పనిచేసేవారు. ఆ తర్వాత కొంత కాలానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకూ ఒకే సినిమాకు పనిచేయడం అలవాటు చేసుకున్నారు. అవసరం అనుకుంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా వర్క్ చేసేవారు.
అయితే భోజన ప్రియుడైన ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి వింటుంటే తమాషాగా అనిపిస్తుంది. నిత్యం తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిద్రలేచే ఆయన యోగాసనాలు, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, బ్రేక్ ఫాస్ట్ చేసే వారు. రోజూ 24 ఇడ్లీలు అవలీలగా తినేవారట. అలాగని అవేమీ చిన్న సైటు ఇడ్లీలు కావు. అరచేతి మందాన ఉండేవట. కొంత కాలం తర్వాత ఇడ్లీలు తినడం మానేసి పొద్దునే భోజనం చేసేవారు. అయితే రోజూ నాన్ వెజ్ ఐటెం ఏదొకటి ఆయన భోజనంలో ఉండాల్సిందే. ఆరు గంటల కల్లా మేకప్ వేసుకుని రెడీగా ఉండేవారు. నిర్మాత వచ్చి ఆయన్ని షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్లేవారు. చెన్నైలో ఉంటే తప్పనిసరిగా భోజనానికి ఇంటికే వెళ్లేవారు. అరగంటలో లంచ్ పూర్తి చేసుకుని, రెండు గంటలకు మరో షూటింగ్‌కు అటెండ్ అయ్యేవారు. షాట్ గ్యాప్‌లో ఆపిల్ జ్యూస్ తాగడం ఎన్టీఆర్‌కు అలవాటు. రోజుకు నాలుగైదు బాటిల్స్ తాగేవారు. ఇక ఈవెనింగ్ స్నాక్స్‌లో డ్రై ఫ్రూట్స్ కానీ, మిరపకాయ బజ్జీలు కానీ ఉండాల్సిందే. ఆయన ఒక్కసారే 30-40 బజ్జీలు తింటుంటే మిగిలిన వాళ్లంతా అలా నోళ్లు తెరుచుకుని చూస్తుండేవారట.
మద్రాసు మౌంట్ రోడ్‌లో బాంబే హల్వా హౌస్ అనే షాప్ ఉండేది. అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకురమ్మనేవారు ఎన్టీఆర్. దాంతో పాటు రెండు లీటర్ల బాదం పాలు కూడా తెమ్మనేవారు. ఇంత పెద్ద డబ్బాలో తీసుకువస్తే వాటిని తినేసి 2 లీటర్ల బాదం పాలు తాగేవారటర. ఎంత తిన్నా హరాయించుకునే శరీరం కావడంతో ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎదుటివారికి వింతగా అనిపించేవి. ఇక సమ్మర్ వస్తే చాలు మధ్యాహ్నం లంచ్‌కు వెళ్లేవారు కాదు ఎన్టీఆర్. మామిడి పళ్ల జ్యూస్ మాత్రం తాగి సరిపెట్టుకునేవారు. టీ నగర్‌లో మామిడి పళ్లు ఎక్కడ దొరుకుతాయో కూడా ఆయనే చెప్పేవారు. రెండు డజన్ల మామిడి పళ్లు తెప్పించేవారట నిర్మాత. తన అసిస్టెంట్‌తో ఆ మామిడి పళ్లు రసం తీయించి, అందులో గ్లూకోజు పౌడర్ కలుపుకొని జ్యూస్ మొత్తం తాగేసేవారు. వేసవిలో ఇదే ఆయనకు లంచ్. మధ్యలో కొంత కాలం కేరళ వైద్యుడి సలహా మేరకు అల్లం, వెల్లుల్లి కలిపి బాగా దంచి, ముద్దగా చేసి వెండి బాక్స్‌లో ఇంటి నుంచి ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పంపేవారు. షాట్ గ్యాప్‌లో ఆ ముద్ద తినేవారు ఎన్టీఆర్. ఇలా తన సినిమాలతోనే కాదు తన ఆహారపు అలవాట్లతోనూ ఎదుటివారిని ఆకట్టుకునేవారట నందమూరి తారక రామారావు.
-
-
ఓటీటీలోకి సత్యదేవ్ ‘స్కైలాబ్’.. ఎప్పటి నుంచి అంటే…
Category : Behind the Scenes OTT OTT Latest Movies Sliders
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ‘స్కైలాబ్’. 1979లో అంతరిక్ష పరిశోధనా శాల నుంచి ‘స్కైలాబ్’ భూమిపై పడనుందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగిన కథగా ఈ కామెడీ సినిమా తెరకెక్కింది. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. బ్రైట్ ఫీచర్స్, నిత్యామీనన్ సొంత నిర్మాణ సంస్థ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఇప్పుడీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయింది. ఈ నెల 14న సంక్రాంతి కానుకగా ‘స్కైలాబ్’ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఆ మేరకు సోనీ లివ్ సంస్థ ట్విట్టర్ లో ప్రకటించారు. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
- January 6, 2022
-
-
టాలీవుడ్‌లో కలకలం… మహేశ్‌బాబుకు కరోనా
Category : Behind the Scenes Movie News Sliders
సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా నిర్థారించారు. ‘‘నాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. కొద్దిపాటి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి నాతో కాంటాక్ట్ అయినవారంతా పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడవచ్చు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండండి’’ అని మహేష్ బాబు పేర్కొన్నారు.
చివరిగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే RRR సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం కోసం రాజమౌళి… మహేష్ బాబు సహా సినిమా టీం మొత్తాన్ని సంప్రదించడంతో ఈ సినిమాని ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. దీంతో కాస్త సమయం దొరకడంతో మహేష్ బాబు చాలా కాలంగా తన కాలి నొప్పితో బాధపడుతున్న క్రమంలో దానికి సర్జరీ చేయించుకున్నారు. కాలు నొప్పి తో బాధపడుతున్న ఆయన స్పెయిన్లో సర్జరీ చేయించుకుని దుబాయ్ లో తన వదిన ఇంట్లో రెస్ట్ తీసుకోవడం కోసం కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లారు. కొంత కాలం పాటు దుబాయ్ లోనే ఉండి క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు అక్కడే జరుపుకున్న మహేష్ బాబు కుటుంబం తాజాగా హైదరాబాద్ కు వచ్చింది.
- December 27, 2021
-
-
‘దిల్ తో పాగల్ హై’ షూటింగ్ షురూ..
Tags : Dil To Pagal Haitollywood
‘శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రవితేజ్ హీరోగా, మిస్ మహారాష్ట్ర అనిత షిండే జంటగా సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దిల్ తో పాగల్ హై’. ఎస్‌ఎమ్‌ఆర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సమర్పణలో గీతా ఫిలిమ్స్ పతాకంపై ఎస్. సోమరాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ క్లాప్‌నిచ్చారు. జైపాల్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇద్దరు ప్రేమికుల ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ కథ వినగానే సినిమా చేయడానికి ముందుకొచ్చారు నిర్మాత. జనవరి 15 తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం. మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.
- December 17, 2021
-
-
Pushpa Review: ‘పుష్ప’ రివ్యూ… సినిమా ఎలా ఉందంటే..
‘అల వైకుంఠపురంలో’ వంటి క్లాస్ మూవీ తర్వాత పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు అర్జున్. ఆర్య, ఆర్య-2 వంటి విజయాల తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. దీంతో కొబ్బరికాయ కొట్టడం నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం హాట్‌టాపిక్‌గా మారింది. బన్నీని ఊరమాస్ లుక్‌లో ‘పుష్ప’గా పరిచయం చేసిన తర్వాత ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.
అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించటం, రష్మిక డీగ్లామర్ పాత్ర చేయటం, సునీల్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకులుగా నటిస్తుండటం ఆసక్తిని కలిగించింది. బన్నీ కెరీర్లో తొలి పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే 250 కోట్ల వరకు ప్రీ రిజీజ్ బిజినెస్ చేసి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప’ ఎలా ఉంది? పుష్పరాజ్‌గా మాస్ లుక్‌లో అల్లు అర్జున్ ఎలా నటించారు? అసలు ఈ సినిమా కథేంటి.. తెలుసుకుందామా..
పుష్పరాజ్(అల్లు అర్జున్) కట్టెల దుకాణంలో కూలీగా పనిచేస్తుంటాడు. అయితే అతడి పుట్టుకకు సంబంధించిన విషయంలో సమాజంలో ఎప్పుడూ అవమానాలే ఎదుర్కొంటూ ఉంటాడు. దీంతో జీవితంలో ఎలాగైనా ఉన్నతస్థాయికి ఎదగాలన్న కాంక్ష అతడిలో రగులుతుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను కొట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసే సిండికేట్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడు కొండారెడ్డి(అజయ్ ఘోష్). ఈ విషయం తెలుసుకున్న పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే డబ్బులు బాగా వస్తాయని ఆ సిండికేట్ తరఫున కూలీగా అడవుల్లోకి వెళతాడు. ఒక కూలీగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో అడుగు పెట్టిన పుష్పరాజ్ ఆ సిండికేట్‌కు నాయకుడుగా ఎలా ఎదిగాడు? స్మగ్లింగ్ చేసే ఎర్రచందనం పోలీసులకు చిక్కకుండా పుష్పరాజ్ ఎలా తరలించాడు? ఈ క్రమంలో అడ్డు వచ్చిన మంగళం శ్రీను(సునీల్), కొండారెడ్డిలను ఎలా ఎదిరించాడు? పోలీసు ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్(ఫహద్ ఫాజిల్) నుంచి పుష్పరాజ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? శ్రీవల్లి(రష్మిక) ప్రేమను ఎలా పొందాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఫస్టాప్…
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ అదిరిపోయింది. వాయిస్ ఓవర్‌తో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే చిత్తూర్ యాసతో సినిమా అసలు కథాంశంలోకి వెళుతుంది. హరీష్ ఉత్తమన్ పోలీస్ ఆఫీసర్ గోవిందప్పగా పరిచయం అవుతాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సాంగ్ *దాక్కో దాక్కో మేక వచ్చి’ బన్నీ మాస్ స్టెప్పులతో అలరిస్తాడు. పుష్ప కొండారెడ్డితో చేతులు కలుపుతాడు. అప్పుడే శ్రీవల్లిగా రష్మిక పరిచయమవుతుంది. ఈ నేపథ్యంలో బన్నీ – రష్మికల మధ్య శ్రీవల్లి సాంగ్ వచ్చి ఆకట్టుకుంటుంది. ఇక మంగళం శీనుగా సునీల్, ద్రాక్షాయణిగా అనసూయ భరద్వాజ్ పాత్రలు పరిచయమవుతాయి. ఆ తర్వాత ఓ ఆసక్తికరమైన స్మగ్లింగ్ సన్నివేశం. ఈ నేపథ్యంలో సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’ వచ్చి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఈ సాంగ్ తర్వాత భారీ యాక్షన్ సీన్.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్” అంటూ బన్నీ చెప్పిన మాస్ డైలాగ్‌తో ఇంటర్వెల్.
సెకండాఫ్..
కొన్ని పరిస్థితుల్లో పుష్ప మంగళం శీనుకి ఎదురుతిరుగుతాడు. శ్రీవల్లి కోసం కొండారెడ్డి సోదరులకు వ్యతిరేకమవుతాడు. దీంతో కథలో మంచి ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే సాలీడ్ మాస్ ఫైట్ బాగా ఆకట్టుకుంది. ఈ ఫైట్ తర్వాత వచ్చిన సామీ సామీ అనే మాస్ సాంగ్‌కి థియేటర్స్‌లో ఈలలు అరుపులతో మోగిపోయాయి. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మొహం కనిపించకుండా అడవిలో పుష్ప చేసే ఫైట్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఫైట్ సెకండాఫ్‌లో హైలెట్ అని చెప్పొచ్చు. దీని తర్వాత వచ్చే ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ అలరిస్తుంది. ఇక షికావత్‌గా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. క్లైమాక్స్‌లో పుష్పకు షికావత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దీని తర్వాత పుష్పకు పెళ్లి జరుగుతుంది. అనంతరం కథ ఎన్ని మలుపులు తీసుకుంటుందనేది రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ చూడాల్సిందే
ఇప్పటి వరకూ వివిధ మాఫియాల నేపథ్యంలో వందల కథలను దర్శకులు వెండితెరపై చూపించారు. హవాలా, డ్రగ్స్, ఆయుధాలు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదీ ఒక సబ్జెక్ట్ అవుతుంది. ‘పుష్ప’ కోసం దర్శకుడు సుకుమార్ ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్ నేపథ్యాన్ని, మాస్‌లో మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్‌ని కథానాయకుడిగా ఎంచుకున్నాడు. ఈ పాయింటే ‘పుష్ప’పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. అందుకు తగినట్లుగానే ప్రేక్షకులను మెప్పించేలా కథ, కథనాలను తీర్చిదిద్దడంలో సుకుమార్ కొంతవరకూ సఫలమయ్యాడు. మాస్ ప్రేక్షకులు మెచ్చేలా పుష్పరాజ్‌ను పరిచయం చేయడం, ఎర్రచందనం రవాణా, సిండికేట్ తదితర వ్యవహారాలతో కథను ప్రారంభించిన దర్శకుడు ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను గ్రాండ్ లుక్‌తో తెరపై చూపించాడు. ప్రతి సన్నివేశం కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా బన్నీ అభిమానులకు కనులపండువగా ఉంటుంది. ఒకవైపు పుష్పరాజ్ ప్రయాణాన్ని చూపిస్తూనే, మరోవైపు సిండికేట్ వెనుక ఉన్న అసలు పాత్రలను పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు.
పుష్పరాజ్ కూలీ నుంచి సిండికేట్ నాయకుడిగా అడుగులు వేయడానికి దోహద పడేందుకు అవసరమైన బలమైన సన్నివేశాలు తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. దీంతో ‘పుష్ప’ పాత్ర పతాక స్థాయికి వెళ్లిపోతుంది. ఎర్రచందనం సిండికేట్ నుంచి వచ్చే పోటీని పుష్పరాజ్ ఎలా ఎదుర్కొంటాడన్న ఆసక్తితో ద్వితీయార్ధం చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. తెరపై సన్నివేశాలు వస్తున్నా, కథ ముందుకు నడవదు. మధ్యలో శ్రీవల్లి ప్రేమ ప్రయాణం, పాటలు బాగున్నా, ఒక సీరియస్ మోడ్‌లో సాగుతున్న కథకు చిన్న చిన్న బ్రేక్‌లు వేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలోనే పోలీస్ ఆఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాజిల్ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పుష్పరాజ్- భన్వర్ సింగ్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఆశించినా ఆయా సన్నివేశాలన్నీ సాదాసీదాగా సాగుతుంటాయి. ఒక బలమైన ముగింపుతో తొలి పార్ట్ ముగుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు పూర్తి సంతృప్తి చెందడు. పార్ట్-2 కోసం చాలా విషయాలను ప్రశ్నార్థంగానే వదిలేసినట్లు అర్థమవుతుంది.
ఎవరెలా చేశారంటే..
‘పుష్ప: ది రైజ్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్ పాత్రను ఎలివేట్ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసినా ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించాడు. చిత్తూరు యాసలో బన్నీ పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది. కమెడియన్‌గా ప్రేక్షకులకు సుపరిచితమైన సునీల్ ఇందులో ప్రతినాయకుడు మంగళం శ్రీను పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం సునీల్ మారిన తీరు, ఆయన డిక్షన్ బాగున్నాయి. అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేశ్, ధనుంజయ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సమంత ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది.
‘పుష్ప’ టెక్నికల్‌గా మరో లెవల్‌లో ఉంది. సినిమాటోగ్రాఫర్ కూబా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌లుక్‌లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం నిడివి పెరిగిందేమోననిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను ఇంకాస్త ఎడిట్ చేస్తే బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. ‘సామి సామి’, ‘ఊ అంటావా’, ‘ఏ బిడ్డా’ పాటలు తెరపైనా అలరించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఓకే. అడవి వాతావరణం చూపించడానికి ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పడిన కష్టం తెరపై ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. తనదైన మార్క్ కథలతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు సుకుమార్ ‘రంగస్థలం’ తర్వాత మరో మాస్ కథను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. పుష్పరాజ్ పాత్రతో సహా మిగిలిన పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ముఖ్యంగా కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేసిన విధానం, అందుకు తగిన సన్నివేశాలు మెప్పిస్తాయి.
చివరిగా..: ‘పుష్ప’ పక్కా మాస్ ఎంటర్‌టైనర్.
Search
Latest Updates
- శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?
- రూ.16వేల కోట్లు చాలవు… ‘అవతార్ 2’ హిట్ కావాలంటే
- నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట
- విశాఖ కనకమహాలక్ష్మి.. ఇక్కడ భక్తులే పూజలు చేయొచ్చు
- ప్రభాస్ ఫ్యాన్‌కి బ్యాడ్‌న్యూస్… ‘ఆదిపురుష్’ మళ్లీ వాయిదా?
- ‘కాంతార’ సర్ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్
© Copyright 2020. All Rights Reserved