రాశుల పరంగా దేవుళ్లకి ఎలాంటి తాంబూలం ఇవ్వాలంటే
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
ఈతి బాధలు తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలని చాలామంది అడుగుతుంటారు. ఆధ్యాత్మికతవేత్తలు, పండితులు, జ్యోతిష్యులు ఇచ్చిన సలహాలతో ఆ విధంగా కార్యాలు చేసి ఫలితం పొందుతుంటారు. అయితే ఒకే పరిహారం అన్ని రాశుల వారికి వర్తించదు. వారు జన్మనక్షత్రం, రాశి తదితరాల ఆధారంగా ఏయే రాశుల ఎలాంటి తాంబూలం ఇవ్వాలన్ని మన పురాణాల్లో పొందుపరిచారు. 12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏయే దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకుందాం…
మేష రాశి
తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి.
వృషభ రాశి
తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు చేకూరుతాయి.
మిథున రాశి
తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
కర్కాటక రాశి
తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.
సింహ రాశి
తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.
కన్యా రాశి
తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే దుఃఖం దూరమవుతుంది.
తులా రాశి
తమలపాకులో లవంగాన్ని ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
వృశ్చిక రాశి
తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి.
ధనుస్సు రాశి
తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
మకర రాశి
తమలపాకులో బెల్లం ఉంచి శనివారం కాళిమాతను పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి.
కుంభ రాశి
తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజిస్తే దుఃఖాలు తొలగిపోతాయి.
మీన రాశి
తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.