2008 నవంబర్‌లో ముంబయి నగరంలో జరిగిన భయానక ఉగ్రవాద దాడిలో వీరోచితంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా సైయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. తెలుగులో ఈ టీజర్‌ని సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేయగా.. హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ టీజర్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చివరిగా ‘మీరు పైకి రాకండి.. వాళ్లని నేను హ్యాండిల్ చేస్తాను’ అంటూ అడివి శేష్ చెప్పిన డైలాగ్ కొసమెరుపు.
- 4 years ago
Telugu BOX Office
అడివి శేష్ ‘మేజర్’ టీజర్
Related Post
- శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?
ఏకలవ్యుడు మహాభారతంలో ఒక గొప్ప యోధుడు, అతనికి గొప్ప చరిత్ర ఉంది. అతని గాథ ఇప్పటికీ చాలా మందికి ఆదర్శం.…
-
రూ.16వేల కోట్లు చాలవు… ‘అవతార్ 2’ హిట్ కావాలంటే
రూ. వంద కోట్ల బడ్జెట్ అంటే మనకు చాలా పెద్ద విషయం, రూ. వెయ్యి కోట్ల వసూళ్లు ఇంకా పెద్ద…
-
నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తుంది. రేపో మాపో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని…