X

విజువల్ వండర్.. అవతార్-2 ట్రైలర్ వచ్చేసింది

హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేమ్స్‌ కామెరాన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై సృష్టించిన విజువల్‌ వండర్‌ ‘అవతార్’. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన గ్లోబల్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా వచ్చి 13ఏళ్లయినా దాని బాక్సాఫీసు రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. దీనికి సీక్వెల్ వస్తోందని కామెరూన్ ప్రకటించినప్పటి నుంచి సినీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు డిసెంబర్ 16న ‘అవతార్ 2’ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా అవతార్ మేనియా మొదలైపోయింది.

ఎపిక్‌ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ లో వస్తున్న ఈ చిత్రంలో కేట్‌ విన్స్‌లెట్‌ కూడా భాగం అవుతుండటం విశేషం. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌- టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రధాన భారతీయ భాషలన్నింటిలో విడుదల చేస్తున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో అవతార్ 2ని విడుదల చేయనుండటం విశేషం. తాజాగా దీనికి సంబంధించి ట్రైలర్‌ని విడుదల చేయగా వ్యూస్ పరంగా రికార్డులు కొల్లగొడుతోంది. 3డీ వెర్షన్‌లో సాగుతున్న ట్రైలర్‌ అవతార్‌ 2 మరో వండర్‌లా ఉండబోతుందని చెబుతోంది. ఈ ట్రైలర్‌‌ రాకతో సినిమాని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని అందరిలోనూ ఆసక్తి మరింత పెరిగిపోయింది.

Telugu BOX Office:
Related Post