షింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన హీరో ఫస్ట్‌లుక్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 22న ఈ చిత్రం నుండి హీరోయిన్ గ్లింప్స్ ని విడుదలచేసింది చిత్ర యూనిట్. సలోని మిశ్రా ఎలక్ట్రిఫాయింగ్ పోలీస్ ఆఫీసర్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తోంది. దర్శకుడు శివకు ఇది మొదటి సినిమా అయినా చాలా స్టైలిష్ గా తెరకెక్కించారని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతోంది.
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్ జీత్ విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవి వర్మ, శశిధర్ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్, పూజా రామచంద్రన్, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్ తరుణ్, మాస్టర్ దేవాన్ష్, బేబి ఓజల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్ మేనేజర్: కిరణ్ కాసా, పిఆర్ఓ: బి.ఎ రాజు, చీఫ్ కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్ బి.