Shambo Shankara 3rd song released by Dil Raju

Shambo Shankara 3rd song released by Dil Raju

శంక‌ర్ ని హీరోగా, శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న `శంభో శంక‌ర`. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు, రెండు పాటలకు విశేష స్పందన లభించింది.. విడుదలైన 3 రోజులకే 30 లక్షల వ్యూస్ ను పొంది ఇప్పటికీ 40లక్షలకు పైగా చేరుకుంది… యూట్యూబ్ లొనే ఇదొక అరుదైన విశేషం అని చెప్పవచ్చు… ఇదిలా ఉంటె… అమలాపురంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘గుచ్చుకున్నావే’ అనే 3వ పాటను ఆవిష్కరించారు.. ఈ చిత్రంలో ఈ పాటే హైలెట్ గా నిలవనుంది.. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. శంకర్ ఒక కమెడియన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు.. అప్పటినుంచే ప్రేక్షకుల మన్ననలను పొందుతూ ఈ స్థాయికి చేరుకున్నారు… హీరోగా కూడా తాను రాణిస్తాడాని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా… పాటలు చాలా బాగున్నాయి.. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నా అన్నారు.. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న శంభో శంకర చిత్రాన్ని ఈ నెలాఖరు న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఈ చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలియచేసారు..

షకలక శంక‌ర్, కారుణ్య నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి మాట‌లు: భ‌వానీ ప్ర‌సాద్, కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తాలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.

Related Images: